Kannappa: కన్నప్పలో రుద్రగా ప్రభాస్ కంటే ముందు ఆ స్టార్ హీరోను అనుకున్నారా? చివరకు అలా కావడంతో..

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూవస్తోన్న ఈ డివోషనల్ డ్రామా శుక్రవారం (జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచు విష్ణుతో పాటు కేవలం అరగంట మాత్రమే కనిపించే ప్రభాస్ సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయంటున్నారు.

Kannappa: కన్నప్పలో రుద్రగా ప్రభాస్ కంటే ముందు ఆ స్టార్ హీరోను అనుకున్నారా? చివరకు అలా కావడంతో..
Kannappa Movie

Updated on: Jun 27, 2025 | 10:03 PM

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్ర కన్నప్ప. పరమ శివుడు భక్తుడైన భక్త కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్. ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్  శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి, , యోగి బాబు, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా (విష్ణు కూతుళ్లు) ఇలా ఎంతో మంది ఈ సినిమాలో నటించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిపి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కన్నప్ప సినిమాను నిర్మించారు. సుమారు రూ. 300 కోట్లతో ఈ మూవీని నిర్మించినట్లు తెలుస్తోంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను చూసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఇక సినిమాలో మంచు విష్ణు నటన హైలెట్ గా నిలిచిందంటున్నారు. అలాగే సినిమాలో అరగంట కనిపించినా ప్రభాస్ సీన్స్ కు కూడా ఆడియెన్స్ నుంచి విజిల్స్ పడ్డాయంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్, విష్ణుల మధ్య వచ్చే సీన్లు, డైలాగులకు అభిమానుల నుంచి మంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిందంంటున్నారు. కన్నప్ప సినిమా విజయంలో ప్రభాస్ రుద్ర పాత్ర కూడా హైలెట్ గా నిలిచిందని రివ్యూలు వస్తున్నాయి.

 

ఇవి కూడా చదవండి

కాగా కన్నప్ప సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. కన్నప్ప సినిమాని అనుకున్న సమయంలో చిత్ర బృందం రుద్ర పాత్రలో ప్రభాస్ కంటే ముందు మరొక హీరోను అనుకున్నారట. మంచు విష్ణు కూడా ఆ హీరోనే అనుకున్నారట. అయితే కొంత మంది మాత్రం ప్రభాస్ ను తీసుకుంటే బాగుంటుందని సలహాలు ఇచ్చారట. మరి ప్రభాస్ కాకుండా రుద్ర పాత్ర కోసం విష్ణు ముందుగా అనుకున్న హీరో ఎవరో తెలుసా? అతను మరెవరో కాదు పాన్ ఇండియా స్టార్ హీరో ఎన్టీఆర్. అయితే మోహన్ బాబుతో పాటు చాలా మంది విష్ణుకు ప్రభాస్ పేరును సూచించారట. దీంతో విష్ణు వెంటనే ప్రభాస్ తో మాట్లాడి ఒప్పించారట. అయితే ఇందులో నిజమెంతుంతో తెలియదు కానీ రుద్ర పాత్రకు ప్రభాస్ పర్పెక్ట్ గా సూటయ్యాడని అభిమానులు చెబుతున్నారు. మొత్తానికి కన్నప్ప సినిమా మంచు అభిమానులకు మాత్రమే కాదు ప్రభాస్ అభిమానులకు కూడా మంచి వినోదాన్ని అందిస్తోందని చెప్పాలి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .