NTR: ‘అన్న’ అంటూ తెలుగులో మాట్లాడిన జపనీస్‌ లేడీ ఫ్యాన్.. ఎన్టీఆర్ రియాక్షన్ చూశారా

జపాన్‌ పర్యటనపై తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. జపనీస్ మహిళా అభిమాని ఒకరు తెలుగు నేర్చుకోవడంపై.. ఆయన బావోద్వేగానికి లోనవుతూ ప్రత్యేకంగా సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. ఎప్పుడు సందర్శించినా.. జపాన్‌ తనకు ప్రత్యేక జ్ఞాపకాలు అందిస్తుందని పేర్కొన్నారు.

NTR: అన్న అంటూ తెలుగులో మాట్లాడిన జపనీస్‌ లేడీ ఫ్యాన్.. ఎన్టీఆర్ రియాక్షన్ చూశారా
NTR With Japan Fans

Updated on: Mar 27, 2025 | 3:43 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. ఇండియాలోనే అపారమైన ప్రతిభ ఉన్న నటుడు. ఆయన డైలాగ్ డిక్షన్, భాషా ప్రావీణ్యం, డ్యాన్స్.. ఇలా అన్నీ అమితమైన అభిమానుల్ని సంపాదించుకునేలా చేశాయి. ముఖ్యంగా ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ఎన్టీఆర్ స్థాయి ప్రపంచానికి తెలిసింది. వివిధ దేశాల్లో తారక్‌కి అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా తారక్ ఎప్పుడు జపాన్ వెళ్లినా.. అక్కడి ఫ్యాన్స్ ప్రేమ, వాత్సల్యాన్ని కనబరుస్తూ ఉంటారు. తాజాగా తారక్ జపాన్‌ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ అభిమానులతో మాట్లాడుతూ.. వారికి ఆటోగ్రాఫ్స్ ఇస్తూ ఉండగా.. అనుకోని ఘటన జరిగింది. ఓ జపాన్ మహిళ తెలుగులో ఎన్టీఆర్‌తో సంభాషించింది.

“అన్న.. నేను ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నాను. నేను రెండు సంవత్సరాలుగా తెలుగు రాస్తూ ప్రాక్టీస్ చేస్తున్నాను” అంటూ ఆ మహిళా అభిమాని పుస్తకాన్ని తారక్‌కి ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆమె నాకు మీరు నాకు ఆదర్శం అని చెప్పగా.. మీరే నాకు పెద్ద ప్రేరణ అని బదులిచ్చారు తారక్. ఈ వీడియోను ఆయన ప్రత్యేకంగా ట్విట్టర్‌లో పంచుకున్నారు.

‘‘నేను వెళ్లిన ప్రతిసారి జపాన్‌ నాకు మంచి జ్ఞాపకాలు అందిస్తుంటుంది. కానీ, ఈసారి ఇంకా డిఫరెంట్‌గా అనిపించింది. RRRచూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నానని ఓ జపనీస్‌ ప్యాన్ చెప్పడం బావోద్వేగాన్ని కలిగించింది. భాషలు, సినీ అభిమానిగా.. విభిన్న సంస్కృతులతోపాటు భాష నేర్చుకునేందుకు సినిమా వారధిగా మారుతున్నందుకు ఆనంద పడుతున్నా. భారతీయ సినిమా వరల్డ్ వైడ్ అభిమానుల్ని సొంతం చేసుకుంటుందనేందుకు ఇది మరో కారణం’’ అని రాసుకొచ్చారు. తాను షేర్‌ చేసిన వీడియోలో.. అభిమానులకు ఆటోగ్రాఫ్‌ ఇస్తూ కనిపించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.