RRR Movie News: జక్కన్న చెక్కిన శిల్పం ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతుంది. కుంభస్థలాన్ని బద్దలు కొడుతూ ముందుకు వెళ్తుంది. ఎన్టీఆర్(Jr Ntr), రామ్ చరణ్(Ram Charan) నటనకు ప్రేక్షకలోకం జేజేలు కొడుతుంది. ఎమోషన్స్, ఎలివేషన్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేశారు రాజమౌళి. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇలాంటి సినిమా ధర్మకధీరుడు రాజమౌళి మాత్రమే తీయగలడని విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో ప్రకంపనలు రేపుతోంది. తొలి రోజే రూ.223కోట్లు సాధించి ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేసింది. మూడు రోజులు పూర్తయ్యేసరికి మరో మైలురాయిని చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.500కోట్ల వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సోషల్‌మీడియా ద్వారా తెలిపారు.
#RRR is setting new BENCHMARKS… ₹ 500 cr [and counting]… WORLDWIDE GBOC *opening weekend* biz… EXTRAORDINARY Monday on the cards… #SSRajamouli brings back glory of INDIAN CINEMA. Note: Non-holiday release. Pandemic era. pic.twitter.com/ztuu4r9eam
— taran adarsh (@taran_adarsh) March 28, 2022
అపర మేథావుల్లా ఫీలయ్యే కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేసినా కానీ.. ప్రభంజనం ఆగలేదు. జనాల అభిమానికి అడ్డు పడలేదు. ప్రపంచ సినిమా చదివేసిన వాళ్లలా.. సినిమాల విషయంలో అపర మేథావుల్లా కలరింగ్ ఇచ్చే కొందరు సోషల్ మీడియాలో.. అవాక్కులు.. చవాక్కులు పేల్చినా.. జనాలు వారిని సినిమాల్లో సైడ్ విలన్లలాగా లైట్ తీసుకున్నారు. RRRకు భారీ విజయాన్ని కట్టబెట్టారు. కనీసం జక్కన్న కాలిగోటిని టచ్ చేయడానికి కూడా వారు పనికిరారు అంటూ కలెక్షన్లతో నిరూపించారు.
RRR అనేది తెలుగు ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ జీవితాల ఆధారంగా రూపొందించబడిన కల్పిత కథ. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించారు. డీవీవీ దానయ్య 450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగన్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ, ఒలివియా మోరిస్ కీలక పాత్రల్లో కనిపించారు.
Also Read: పెరుగన్నంలో అరటిపండు కలిపి తింటే.. ఇక మీకు తిరుగుండదు పండు