‘RRR’ Movie : యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకోసం టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్ గా తారక్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి.
ఇక ఈ సినిమానుంచి ఎలాంటి అప్డేట్ లేదా ఫోటో రిలీజ్ అయితే అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం క్లైమాక్స్ చెక్కే పనిలో ఉన్నాడు జక్కన. షూట్ గ్యాప్ లో రెస్ట్ తీసుకుంటున్న చరణ్ -తారక్ ఫొటోలను రిలీజ్ చేసింది అర్ఆర్ఆర్ యూనిట్. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో ఈ షూటింగ్ కొనసాగుతోంది. ఇక ఇటీవల విడుదల తేదీని ప్రకటించిన నేపథ్యంలో నెమ్మదిగా ప్రమోషన్స్‌ను కూడా షురూ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. అలియా భట్, ఓలివియా మోరిస్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని, రే స్టీవెన్‌సన్, అలీ సన్ డూడీ కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఆగస్టు 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Unwinding in the midst of vigorous practice sessions for THE CLIMAX!! ? #RRRMovie #RRR #RRRDiaries pic.twitter.com/OXqHkh4sUc
— RRR Movie (@RRRMovie) February 5, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :
మరో సర్ఫ్రైజ్ ఇచ్చిన ‘ఖిలాడీ’ టీం.. కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్.. వెల్కమ్ చెప్పిన చిత్రయూనిట్..