Jani Master: జానీ మాస్టర్‌కు బెయిల్.. నేషనల్ అవార్డు కోసం బయటకు

|

Oct 03, 2024 | 11:35 AM

తాజాగా జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ కూడా ముగిసింది. నార్సింగ్ స్టేషన్‌ నుంచి ఉప్పరపల్లి కోర్టుకు తరలించి.. మేజిస్ట్రేట్ విచారించిన తర్వాత చంచల్‌గూడ జైలుకు చేర్చారు. అక్టోబ‌ర్ 3 వ‌ర‌కు రిమాండ్ ఖైదీగా కారాగారంలోనే ఉండబోతున్నారు జానీ మాస్టర్. ఇప్పటికే జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్టు రిమాండ్ రిపోర్టులో రాసిచ్చారు పోలీసులు.

Jani Master: జానీ మాస్టర్‌కు బెయిల్.. నేషనల్ అవార్డు కోసం బయటకు
Jani Master
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో జానీ మాస్టర్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. లైంగిక వేధింపుల కేసులో నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో గోవాలో జానీ మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అటు జానీమాస్టర్ భార్య అయేషా తన భర్త ఏ తప్పు చేయలేదు అని అంటున్నారు.. అయేషా ఇచ్చిన సమాచారంతోనే జానీమాస్టర్‌ను అరెస్ట్‌ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ కూడా ముగిసింది. నార్సింగ్ స్టేషన్‌ నుంచి ఉప్పరపల్లి కోర్టుకు తరలించి.. మేజిస్ట్రేట్ విచారించిన తర్వాత చంచల్‌గూడ జైలుకు చేర్చారు. అక్టోబ‌ర్ 3 వ‌ర‌కు రిమాండ్ ఖైదీగా కారాగారంలోనే ఉండబోతున్నారు జానీ మాస్టర్. ఇప్పటికే జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్టు రిమాండ్ రిపోర్టులో రాసిచ్చారు పోలీసులు. దాని ఆధారంగానే రిమాండ్ విధించి జైలుకు తరలించాలని ఆదేశించింది కోర్టు.

కాగా జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. తనకు ఐదు రోజుల మద్యంతర బెయిల్ కోరుతో కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు జానీ. తాను నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉందని.. అందుకు గాను 5 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేశారు జానీ. దీని పై విచారణ జరిపిన కోర్టు జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు చేసింది.

జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం.  నేషనల్‌ అవార్డు తీసుకోవడం కోసం.. జానీ మాస్టర్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. ఈనెల 8న ఢిల్లీలో అవార్డు  జానీ మాస్టర్‌ అవార్డు తీసుకోనున్నారు. బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ధనుష్ నటించిన తిరు సినిమా పాటకు నేషనల్ అవార్డు దక్కింది. ఈ అవార్డు అందుకునేందుకు ఐదు రోజుల పాటు బెయిల్‌పై విడుదలయ్యారు జానీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి