
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర సినిమా కోసం ఇప్పటికే ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు ఇదివరకే వెల్లడించారు. ఇందులో తారక్ ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. ఈ సినిమాతోనే జాన్వీ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. కొద్ది నెలలుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. ఇప్పుడు గోవాలో నెక్ట్స్ షెడ్యూల్ జరుపుకుంటుంది. ఇటీవలే తారక్ గోవాకు పయనమయ్యారు. అక్కడ ఎన్టీఆర్, జాన్వీపై ఇంపార్టెంట్ సీన్స్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తాజాగా జాన్వీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ముంబైకు చేరుకుంది. అయితే తాజాగా దేవర షూటింగ్ సెట్స్ నుంచి తన ఫోటోను షేర్ చేసింది జాన్వీ.
‘దేవర సెట్స్ ను.. టీంను.. తంగం గా నటించడం మిస్ అవుతున్నాను’ ఒక పిక్ లీక్ చేసింది. ఈ పోస్టును బట్టి చూస్తే ఈ సినిమాలో జాన్వీ పాత్ర తంగం అని తెలుస్తోంది. తంగం అంటే బంగారం అని అర్థం అంటా.. ఈ ఫోటోలో జాన్వీ లుక్ మాత్రం ఆకట్టుకుంటుంది. లంగావోణిలో పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా జాన్వీ లుక్ చూస్తుంటే.. ఈ మూవీలో తారక్‌కు తగిన జోడిగా కనిపించడం ఖాయంగా తెలుస్తోంది.
ఈ సినిమాలో జాన్వీ యాక్షన్ సీక్వెన్స్ మరింత హైలెట్ కానున్నాయి. అంతేకాకుండా దేవర మూవీలోని సీక్వెన్స్ తెరకెక్కించడానికి హాలీవుడ్ మేకర్స్ సైతం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, మలయాళీ నటుడు షైన్ టామ్ చాకో కీలకపాత్రలు పోషిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు.
Our sweetest Thangam🩷. She’s going to steal our hearts in #Devara pic.twitter.com/W27EMrPYqd
— Siva Koratala (@SivaKoratala) October 31, 2023
Our #Devara @tarak9999 arrives at the sea shore to join the Goa schedule from today. 🌊
— Devara (@DevaraMovie) October 28, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.