సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి మొదలు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ దాకా అందరూ తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారే. మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమాలు, రాజకీయాలంటూ రెండు పడవల మీద ప్రయాణం చేస్తోన్న ఆయనకు అశేష అభిమాన గణం ఉంది. ఇక చిరంజీవి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ గా ఎదిగిపోయాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ రేంజ్‌కు వెళ్లిపోయాడు. వీరికి మెగాభిమానులే కాకుండా సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉన్నారు. ఈనేపథ్యంలో పవన్ కల్యాణ్, రామ్ చరణ్ ను విపరీతంగా ఆరాధించే అభిమాని ఒకరు తమ పెళ్లి కార్డుపై వీరిద్దరి ఫొటోలను ముద్రించాడు. వాటిని అందరికీ పంచి పెట్టాడు. ప్రస్తుతం ఈ పెళ్లి కార్డుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలికి చెందిన ఉమా మహేశ్వర అయ్యప్ప పవన్ కల్యాణ్, రామ్ చరణ్ లకు వీరాభిమాని. ఇటీవలే అతనికి అనూష దుర్గ అనే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయ్యింది. మార్చి 27న పెళ్లి ముహూర్తం కూడా ఖరారయ్యింది.
సాధారణంగా పెళ్లి శుభలేఖలపై తమ కులదేవుళ్లను ప్రచురిస్తుంటారు. అయితే ఉమామహేశ్వర మాత్రం అందరికీ భిన్నంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రామ్ చరణ్ ఫొటోలను ముద్రించాడు. అలాగే పెళ్లి పత్రిక కార్డులో ఒక వైపు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ సిద్ధాంతాలను, మరోవైపు వివాహ ఆహ్వానాన్ని ముద్రించాడు. ఈ పెళ్లి శుభలేఖను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా అది కాస్తా క్షణాల్లో వైరల్ గా మారింది.
వైరల్ అవుతున్న పెళ్లి శుభలేఖ.. పవన్ కల్యాణ్ ఫొటో, జనసేన పార్టీ సిద్ధాంతాలతో శుభలేఖ
పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి వాసి ఇలా ప్రింట్ చేయించాడు. పవన్ కల్యాణ్ ఫొటో మాత్రమే కాకుండా రామ్ చరణ్ ఫొటో కూడా వేయించాడు. #Janasena #JanasenaTDPAlliance @JSPShatagniTeam @JSPWestGodavari pic.twitter.com/tXJ39ntOlr
— ChotaNews (@ChotaNewsTelugu) March 22, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.