త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు రాబోతుంది. ఆ రోజును పండగలా జరపాలని మహేష్ అభిమానులంతా సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీగా అవుతున్నారు. అలాగే మహేష్ బాబు సూపర్ హిట్ సినిమా పోకిరి సినిమా ను రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ కెరీర్ లో బిగెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన పోకిరి సినిమా ఈ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయ్యిందో తెలిసిందే.. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో మహేష్ కు మాస్ లో క్రేజ్ మరింత పెరిగింది. ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకిప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ 4కే తో రీ రిలీజ్ అవుతోంది. అయితే పవర్ స్టార్(Pawan Kalyan) పుట్టిన రోజున కూడా పవన్ సూపర్ హిట్ సినిమాను రీ రీరిలీజ్ చేయాలని పవన్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా పవన్ అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు ఆ మూవీ మేకర్స్.
సూపర్ హిట్ జల్సా సినిమాను పవన్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2 న 4కే రెజల్యూషన్ తో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఆల్ టైం సూపర్ హిట్ గా నిలిచింది. జల్సా సినిమాను గీత ఆర్ట్స్ నిర్మించింది. తాజాగా ఈ సినిమాను పవన్ పుట్టిన రోజున సెప్టెంబర్ 2న 4కే ప్రింట్ ను రిలీజ్ చేస్తామని వెల్లడించారు. దాంతో పవన్ అభిమానులు సెప్టెంబర్ 2న సందడి చేయడానికి రెడీ అవుతున్నారు.