Jagapathi Babu: వెంకటేష్‌తో సినిమా చేయకపోవడానికి కారణం అదే.! మనసులో మాట చెప్పిన జగ్గుభాయ్

టాలీవుడ్ నటుడు జగపతి బాబు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను పంచుకున్నాడు. వెంకటేష్‌తో సినిమా చేయకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాల్యం నుంచి తాను, వెంకటేష్ ఫ్రెండ్స్ అని.. అవకాశం రాలేదని తెలిపారు. ఆ వివరాలు ఇలా..

Jagapathi Babu: వెంకటేష్‌తో సినిమా చేయకపోవడానికి కారణం అదే.! మనసులో మాట చెప్పిన జగ్గుభాయ్
Jagapathi Babu

Updated on: Jan 22, 2026 | 11:39 AM

టాలీవుడ్ నటుడు జగపతి బాబు తన జీవితంలోని సవాళ్లు, డబ్బు పట్ల తన వైఖరి, అలాగే వెంకటేష్‌తో సినిమా చేయకపోవడం లాంటి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. డబ్బు అనేది జీవితంలో ఒక భాగం మాత్రమేనని, అది మొత్తంగా జీవితం కాదని అతడు వివరించాడు. డబ్బు పిచ్చి ఒక పెద్ద జబ్బు లాంటిదని.. అది మనుషులను మార్చేస్తుందని పేర్కొన్నాడు.

ఇది చదవండి: ‘ఆ సాంగ్ వల్లే హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!’

ఎప్పుడూ భౌతిక వస్తువులపై మమకారాన్ని పెంచుకోకూడదని జగపతి బాబు అన్నాడు. ఒకప్పుడు తాను అత్యంత ఖరీదైన ల్యాండ్ క్రూజర్ ప్రాడో కారును ఉపయోగించేవాడినని, దానిపై మమకారాన్ని పెంచుకోకుండా వెంటనే అమ్మేయమని ఆదేశించానని తెలిపాడు. అలాగే, ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన ఇంటిని అమ్మాల్సి వచ్చినప్పుడు కూడా తాను పెద్దగా బాధపడలేదని చెప్పుకొచ్చాడు. వైజాగ్‌లో లెజెండ్ షూటింగ్‌లో ఉన్నప్పుడు తన భార్య ఇంటిని ఖాళీ చేసిందని, తనకు ఇల్లు పోయిందనే బాధ ఎప్పుడూ రాలేదన్నాడు. ఇటీవల ఒక వీడియో షూట్ కోసం పాత ఇంటి ముందు నిలబడి, అదొకప్పుడు తన ఇల్లు అని, ఇప్పుడు చిరునామా అదేనని, పేరు మారిందని మాత్రమే చెప్పానని గుర్తు చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: టైమ్ చూసి చావుదెబ్బ కొట్టారు కదా భయ్యా.! ఇక టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు..

వెంకటేష్, తాను చిన్ననాటి నుంచి మంచి స్నేహితులమని.. వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ లాంటివారి కుటుంబాలతో తమ కుటుంబాలకు సన్నిహిత సంబంధాలు ఉండేవని జగపతి బాబు వివరించాడు. వెంకటేష్‌తో సినిమా చేయాలని తనకు కూడా ఉందని, అయితే ఇప్పటివరకు సరైన అవకాశం కుదరలేదని తెలిపాడు. తామిద్దరికీ తగ్గ కథతో ఎవరైనా డైరెక్టర్ వస్తారేమో.. భవిష్యత్తులో అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. తన జీవితంలో కష్టాలు ఉన్నప్పటికీ, సంజయ్ దత్ లాంటి వారి జీవితాలతో పోల్చుకుంటే తన జీవితం ఎంతో అద్భుతంగా ఉందని, తృప్తితో జీవిస్తున్నానని జగపతి బాబు వెల్లడించాడు.

ఇది చదవండి: షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏమన్నారంటే.?

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..