జబర్దస్త్‌లో సుధీర్, హైపర్ ఆది కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నది అతడే..

జబర్దస్త్ రాము ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో షోలో అత్యధిక పారితోషికం తీసుకున్నది ఎవరో చెప్పాడు. చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శీను లాంటి వారు సినిమా అవకాశాలు, ఈవెంట్ల ద్వారా బాగా సంపాదించుకున్నారని తెలిపారు. రోజా, నాగబాబులతో తనకున్న అనుబంధాన్ని వివరించాడు.

జబర్దస్త్‌లో సుధీర్, హైపర్ ఆది కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నది అతడే..
Jabardasth Ramu

Updated on: Jan 28, 2026 | 4:00 PM

జబర్దస్త్ నటుడు రాము ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జబర్దస్త్ షోలోని తన అనుభవాలు, ఇతర నటీనటులు గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. షోకు సంబంధించిన పలు కీలక అంశాలపై అతడు తన అభిప్రాయాలను పంచుకున్నాడు. షోలో జడ్జ్‌లుగా వ్యవహరించిన రోజా, నాగబాబులతో తన అనుబంధం గురించి మాట్లాడుతూ, వారు తనను ఎంతో ఆదరించారని తెలిపాడు. రోజా మేడం ఎప్పుడూ తనను పలకరిస్తూ, తిరిగి జబర్దస్త్‌లోకి ఎప్పుడు వస్తావని అడిగేవారని చెప్పాడు. నాగబాబు సైతం తనను వ్యక్తిగతంగా పలకరించి, పనితీరును అభినందించేవారని రాము గుర్తు చేసుకున్నాడు. జబర్దస్త్ చరిత్రలో అత్యధిక పారితోషికం తీసుకున్నది ఎవరో రాము చెప్పాడు. ప్రారంభ రోజుల్లో చమ్మక్ చంద్ర అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్నారని వెల్లడించాడు. ఆ తర్వాత సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శీను లాంటి వారు జబర్దస్త్‌తో పాటు సినిమాలు, ఈవెంట్ల ద్వారా బాగా సంపాదించి స్థిరపడ్డారని వివరించాడు. వారి ఎదుగుదలను చూసి తనకు ఎలాంటి అసూయ లేదని, ఎవరి సమయం వచ్చినప్పుడు వారు అభివృద్ధి చెందుతారని పేర్కొన్నాడు.

ఇది చదవండి: హీరోయిన్లు అందరూ శోభన్ ‌బాబు దగ్గరకు వెళ్లి ఏం మాట్లాడేవారంటే.? అసలు విషయాన్ని చెప్పిన జయసుధ

రష్మీ, అనసూయ మధ్య కోల్డ్‌వార్ ఉందనే పుకార్లపై అడిగినప్పుడు, అది తమకు తెలియదని రాము స్పష్టం చేశాడు. వారిద్దరి మధ్య ఉన్న పోటీ, ఇబ్బందులు తమకు అనవసరమని, వారిద్దరూ తమ ప్రోగ్రామ్‌ను మరింత మెరుగ్గా చేయాలని మాత్రమే ఆలోచిస్తారని అన్నాడు. యాంకరింగ్‌లో ఇద్దరి మధ్య పోటీ ఉంటుందని, అది సహజమని రాము పేర్కొన్నాడు. అనసూయ, రష్మీ ఇద్దరితోనూ తాను పనిచేశానని, వారు మంచిగా ఉంటారని తెలిపాడు. మళ్లీ జబర్దస్త్‌లోకి తిరిగి వెళ్లనని రాము కుండబద్దలు కొట్టాడు. జబర్దస్త్ వదిలి వెళ్లినందుకు తనపై కొందరు నెగిటివ్‌గా మాట్లాడారని, విమర్శించారని, అయితే అలాంటి వారి మాటలను తాను పట్టించుకోనని తెలిపాడు. ప్రస్తుతం జబర్దస్త్ వాట్సాప్ గ్రూపుల్లో కూడా తాను లేనని వెల్లడించాడు.

ఇది చదవండి: ‘తాగేసి షూటింగ్‌కి వచ్చానని.. ఎన్టీఆర్ మా ఫైటర్స్‌ను పిలిచి ఏం చేశాడంటే..’

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..