
జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు నరేష్. తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు నరేష్. తనకున్న వైకల్యాన్నే.. తనకు ప్లస్‌గా మార్చుని బుల్లి తెరపై రాణిస్తున్నాడు. కమెడియన్ గా నవ్వులు పూయిస్తున్నాడు. జబర్దస్త్ నరేష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా తన పెళ్లి, కుటుంబం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. గతంలో నరేష్ పెళ్లి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు పెళ్లీడు వచ్చిందని, త్వరలో ఓ ఇంటివాడు కావాలనే కోరిక బలంగా ఉందని నరేష్ చెప్పుకొచ్చాడు. నాకంటూ ఒక కుటుంబం ఉండాలి, నాకంటూ పిల్లలు ఉండాలి అనే ఆశయం తనలో ఉందని నరేష్ తెలిపాడు. తన పిల్లలకు మంచి భవిష్యత్తును కచ్చితంగా ఇస్తానని, తనకు మంచి ఆస్తి ఉందని, కాబట్టి భవిష్యత్తులో వారికి ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటానని చెప్పుకొచ్చాడు.
తన కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలనే దానిపై నరేష్ మాట్లాడుతూ.. ఆమె తన కంటే కొద్దిగా ఎత్తుగా ఉండాలని, అంటే కనీసం ఒకటిన్నర అడుగు ఎక్కువ ఎత్తు కోరుకుంటున్నానని సరదాగా చెప్పాడు. ముఖ్యంగా, తన తల్లిదండ్రులను బాగా చూసుకునే వ్యక్తిత్వం ఉండాలని, అలాగే తన వృత్తిని, పనిని పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి కావాలని చెప్పుకొచ్చాడు. ఈవెంట్లకు వెళ్లేటప్పుడు, షూటింగ్‌ల సమయంలో తాను ఫోన్లు, వీడియో కాల్స్ ద్వారా టచ్‌లో ఉంటానని, తన దూరాన్ని, పని స్వభావాన్ని అర్థం చేసుకుంటే చాలని అన్నాడు.
ఇటీవల ఓ షోలో పెళ్లి చూపుల ప్రోమో గురించి అడగగా.. గతంలో ఒక ఎపిసోడ్‌లో వచ్చిన అమ్మాయితో తన పెళ్లి కేవలం ఒక ప్రమోషనల్ కాన్సెప్ట్ మాత్రమేనని, నిజమైన సంబంధం కాదని నరేష్ స్పష్టం చేశాడు. ఆ అమ్మాయి కూడా ఆ రోజే వచ్చిందని, అదంతా కేవలం ఎపిసోడ్ కోసం మాత్రమేనని ఎపిసోడ్ చివరిలోనే తాము స్పష్టత ఇచ్చామని తెలిపాడు. కట్నాల గురించి ప్రస్తావించగా, తనకు పెద్దగా కట్నాలు అవసరం లేదని, ఒకవేళ అమ్మాయి అడిగితే మాత్రం తాను కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని సరదాగా బదులిచ్చాడు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి