AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth : డబ్బుల కోసం రోడ్డు మీద పర్సులు అమ్మాడు.. కట్ చేస్తే.. ఇప్పుడు జబర్దస్త్ లో తోపు కమెడియన్.. రూ.200 కోట్ల ఆస్తులు!?..

జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని.. సవాళ్లను అధిగమించిన నటీనటులు చాలా మంది ఉన్నారు. అందులో జబర్దస్త్ కమెడియన్స్ చాలా మంది ఉన్నారు. తాజాగా ఓ నటుడు తాను కష్టాల నుండి అగ్రస్థానానికి ఎదిగిన తన అద్భుత ప్రయాణాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. హోటల్ కార్మికుడిగా జీవితం ప్రారంభించి, కుటుంబ పోషణ కోసం పలు ఉద్యోగాలు చేశానని గుర్తు చేసుకున్నారు. భార్య ప్రోత్సాహంతో కళారంగంలోకి అడుగుపెట్టి గుర్తింపు పొందారు.

Jabardasth : డబ్బుల కోసం రోడ్డు మీద పర్సులు అమ్మాడు.. కట్ చేస్తే.. ఇప్పుడు జబర్దస్త్ లో తోపు కమెడియన్.. రూ.200 కోట్ల ఆస్తులు!?..
Komurakka
Rajitha Chanti
|

Updated on: Jul 20, 2026 | 1:52 PM

Share

ప్రేక్షకులను తన హాస్యంతో అలరిస్తూ, జబర్దస్త్ కొమరక్కగా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడైన కొమరం, తన జీవిత ప్రయాణాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన పడిన కష్టాలు, పోరాటాలు, విజయం సాధించిన తీరు ఎందరికో ఆదర్శప్రాయమనే చెప్పాలి. కొమరం అసలు పేరు కుమార్. ఆయన 10వ తరగతి పూర్తయ్యాక, ఆర్థిక పరిస్థితుల కారణంగా గ్రామం వదిలి హైదరాబాద్ వచ్చారు. నగరంలో తాజ్‌మహల్, కామత్, నందిని, అమృత, సుదర్శన్ వంటి అనేక హోటళ్లలో దాదాపు ఎనిమిదేళ్లపాటు పనిచేశారు. కేవలం హోటల్ పనికే పరిమితం కాకుండా, ఖాళీ సమయంలో తన స్టాఫ్ రూంలో కిరాణా షాపు నడిపి, పర్సులు, ఎఫ్‌ఎం రేడియోలు, నైటీలు, స్కూల్ బ్యాగులు, వర్షాకాలంలో గొడుగులు వంటి వస్తువులను బేగంబజార్ నుండి కొని అమ్మేవాడినని చెప్పుకొచ్చారు. “నా ఊరు, అమ్మ, నా కుటుంబం అందరినీ వదిలి వచ్చింది డబ్బు కోసమే, సమయం వృథా చేయడానికి కాదు” అని ఆయన అప్పట్లో నమ్మేవారని అన్నారు. ఈ క్రమంలో ఆయన ఉస్మానియా యూనివర్సిటీ వద్ద పోలీసుల చేతిలో దెబ్బలు తినడం, 2013-14లో ఆంధ్రా బ్యాంక్ దగ్గర జరిగిన బాంబు పేలుడులో కొద్ది దూరంలో ఉండటం వంటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

మిమిక్రీపై ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోకి రావాలని చిన్నప్పటి నుండి కలలు కన్నారు. రవీంద్రభారతిలో పనిచేస్తున్నప్పుడు సినిమా తారలను చూసి స్ఫూర్తి పొందేవారు. వివాహం, పిల్లలు పుట్టిన తర్వాత, కుటుంబ విభేదాల వల్ల ఆయన అమాలి పనిలోకి వెళ్లారు. రోజుకు 600 బస్తాలు మోస్తూ, రూ. 4,500 జీతంతో జీవనం సాగించారు. ఆ సమయంలో ఆయన భార్య “నీకు సినిమా పిచ్చి కదా, నువ్వు ఈ దుమ్ము మోయలేవు. మూడు సంవత్సరాలు నీకు సమయం ఇస్తున్నాను. ఈలోగా నువ్వు విజయం సాధించలేకపోతే, తిరిగి వచ్చి ఏదో ఒక పని చేసుకుందాం” అని ధైర్యం చెప్పి పంపింది. ఐదేళ్లపాటు ఆమె ప్రతి నెలా రూ. 3,000 తన అకౌంట్‌లో వేసి, తన పిల్లల ఫీజులు, కుటుంబ ఖర్చులు చూసుకున్నారు. గ్రామంలో ఇతరుల విమర్శలను లెక్కచేయకుండా ఆయన భార్య చూపిన మద్దతు ఆయన విజయానికి పునాదని అన్నారు.

ఆకలితో ఇబ్బంది పడుతున్న సమయంలో, సొంతంగా ఒక కాన్సెప్ట్‌ను సృష్టించుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటి ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి అన్న తల్లి కొమరమ్మ పేరు మీద, యువకుడిగా కాకుండా వృద్ధురాలి గెటప్‌ను ఎంచుకున్నారు. వృద్ధురాలి గెటప్‌లో మాట్లాడితే ఎవరూ పెద్దగా పట్టించుకోరని, స్వేచ్ఛగా మాట్లాడొచ్చని భావించారు. ఎమ్మెల్యే సూచన మేరకు కొమరమ్మ పేరును, అమ్మ అని పిలిస్తే కొన్ని పరిమితులు ఉంటాయని భావించి, కొమరక్కగా మార్చారు. అలా కొమరక్క పాత్రకు ప్రాణం పోశారు. కొమరం అక్క ఈరోజు జబర్దస్త్‌లో అత్యంత ధనవంతులలో ఒకరిగా గుర్తింపు పొందారు. “నేను సంపాదించినది కాదు, మా నాన్న కొంత ఇచ్చారు” అని వినయంగా చెప్తారు. అయితే, తనకు వేరే అలవాట్లు లేవని, సంపాదించిన ప్రతి రూపాయిని భూమి మీద పెట్టుబడిగా పెట్టి, దైవానుగ్రహం వల్ల అది ఇప్పుడు పెద్ద ఆస్తిగా మారిందని ఆయన వివరించారు.

కొమురక్క పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..

Follow Us