Jabardasth Dorababu: మా ఆయన ఆ కేసులో ఇరుకున్నప్పుడు ఆ జబర్దస్త్ నటుడే కాపాడాడు: దొరబాబు భార్య

కొన్నేళ్ల క్రితం జబర్ధస్త్‌ కమెడియన్లు దొరబాబు, పరదేశి ఓ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. అప్పుడీ కేసు టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ కేసు విషయమై ఓ ఇంటర్వ్యూలో దొరబాబు భార్య, యాంకర్ అమూల్య ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Jabardasth Dorababu: మా ఆయన ఆ కేసులో ఇరుకున్నప్పుడు ఆ జబర్దస్త్ నటుడే కాపాడాడు: దొరబాబు భార్య
Jabardasth Dorababu

Updated on: Jul 26, 2026 | 8:01 PM

జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అప్పుడెప్పుడో 2013లో ప్రారంభమైన ఈ టీవీ కామెడీ షో ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. గతంలో కంటే వ్యూయర్ షిప్ తగ్గినా ఇప్పటికీ ఈ షోను రెగ్యులర్ గా చూసే వాళ్లు చాలా మందే ఉన్నారు. టీవీలో కాకపోయినా ముఖ్యంగా యూట్యూబ్ లో జబర్దస్త్ వీడియోలకు లక్షల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. అయితే బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్ షోపై వివాదాలు లేకపోలేదు. ముఖ్యంగా ఈ వేదికపై ప్రదర్శించిన కొన్ని స్కిట్స్ తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. కొన్ని సార్లు అయితే జబర్దస్త్ కంటెస్టెంట్లపై దాడుల కూడా జరిగాయి. ఇక అప్పుడప్పుడూ ఈ జబర్దస్త్ కంటెంట్ పైనా తీవ్ర విమర్శలు వస్తుంటాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు, భార్య భార్తలకు సంబంధించి ఇందులో ప్రసారమైన కొన్ని స్కిట్స్ పై అభ్యంతరాలు కూడా వచ్చాయి. ఈ సంగతి పక్కన పెడితే.. జబర్దస్త్ టీవీ షోలో మంచి కమెడియన్లు గా మంచి గుర్తింపు పొందిన దొరబాబు, పరదేశి ఓ కేసులో ఇరుక్కోవడం తీవ్ర సంచలనమైంది.

సుమారు ఆరేళ్ల క్రితం (2020) దొరబాబు, పరదేశి ఓ కేసులో ఇరుక్కున్నారు. పోలీసులు వీరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసు అప్పట్లో టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు కారణంగా జబర్దస్ తో పాటు అందులో పనిచేస్తోన్న కమెడియన్లపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఈ కేసు కారణంగా జబర్దస్త్ దొరబాబుకు తీవ్ర అవమానాలు ఎదురయ్యాయి. అంతేకాదు చాలా రోజుల పాటు పోలీసు విచారణను కూడా ఎదుర్కొన్నాడు. కాగా ఈ కేసు సమయంలో దొరబాబు, పరదేశీ ఇద్దరూ హైపర్ ఆది టీమ్ లో పనిచేస్తుండే వారు. అయితే ఈ క్లిష్ట సమయంలోనూ దొరబాబుకు అతని భార్య యాంకర్ అమూల్య అండగా నిలిచింది. తనకు తన భర్తంటే ఏంటో తెలుసు అంటూ విమర్శకులకు, ట్రోలర్స్ కు అందరికీ గట్టిగా సమాధానమిచ్చింది. ఇదే సమయంలో హైపర్ ఆదినే తమ ఫ్యామిలీని ఆదుకున్నాడంటూ ఓ టీవీ షోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది అమూల్య. ‘మేము కష్టాల్లో ఉన్న సమయంలో ఆది గారే ఆదుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆయనే మా వెంట ఉన్నారు. అందుకే ఆయన నెంబర్‌ను మా ఫోన్‌లో ‘గాడ్’ అని సేవ్ చేసుకున్నాం’ అని దొరబాబు భార్య చెప్పుకొచ్చింది. బహుశా ఈ చొరవతోనేనేమో హైపర్ ఆది తరచూ దొరబాబుపై ఫన్నీ సైటైర్లు వేస్తుంటాడు. ఈ కేసును తరచూ గుర్తు చేస్తూ పంచులు వేస్తుంటాడు.

ఇవి కూడా చదవండి

భార్యతో జబర్దస్త్ దొరబాబు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us