
జబర్దస్త్ ద్వారా పాపులర్ అయినా వారిలో కమెడియన్ రైజింగ్ రాజు ఒకరు. ఈ కమెడియన్ చాలా ఏళ్ల నుంచే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. జబర్దస్త్ లో తన కామెడీతో నవ్వులు పూయించాడు. ఈ మధ్య కాలంలో ఆయన పెద్దగా కనిపించడం లేదు. కెరీర్ బిగినింగ్ లో కొన్ని సినిమాల్లో సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ పోషించారు. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. అదే సమయంలో జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాజు తన కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హైపర్ ఆది తో కలిసి టీమ్ లీడర్ గా వందలాది స్కిట్లు చేశారాయన. జబర్దస్త్ స్టేజ్ పై హైపర్ ఆదితో కలిసి నవ్వులు పూయించాడు రైజింగ్ రాజు.
ప్రస్తుతం అడపా దడపా సినిమాల్లోనూ నటిస్తున్నారీ సీనియర్ కమెడియన్. తాజాగా ఓ టీవీ షోకు హాజరైన రైజింగ్ రాజు తన కష్టాల గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ముఖ్యంగా తన కూతురి పెళ్లి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ‘నేను జబర్దస్త్‌కి వెళ్లకముందు నా బిడ్డ పెళ్లి చేయడానికి కూడా డబ్బుల్లేవు. చందాలు వసూలు చేసి నా కూతురికి పెళ్లి చేశాను. రాకెట్ రాఘవ, తాగుబోతు రమేష్, ధన్‌రాజ్ ఇలా కొందరు తలా ఓ ఐదు వేలు ఇచ్చారు.
ఆ డబ్బులతోనే నా కూతురి పెళ్లి చేశాను’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు రైజింగ్ రాజు. కాగా తనకు హైపర్ ఆది ఎంతో మేలుచేశారంటున్నారు రైజింగ్ రాజు. ‘కరోనా సమయంలో నాకు మనవరాలు పుట్టింది. ఆ సమయంలో నేను బయటికెళ్తే పాపకి లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయేమోనని భయపడి పోయాను. ఎక్కడికి వెళ్లలేక ఇంట్లోనే ఉండిపోయాను. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తాయి. అలాంటి సమయంలో హైపర్ ఆది నాకు చాలా సాయం చేశాడు. ప్రతినెల నా ఇంటికి పేమెంట్ పంపించాడు. నిజంగా హైపర్ ఆది నా దృష్టిలో దేవుడు. నేను స్కిట్స్ చేసినా చేయకపోయినా కూడా పేమెంట్ మాత్రం టైమ్‌కి ఇచ్చాడు’ అని చెప్పుకొచ్చారు రాజు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.