జబర్దస్త్ ద్వారా చాలా మంది సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకున్న విషయం తెలిసిందే. చాలా మంది కమెడియన్స్ గా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నారు. కొంతమంది హీరోలుగా మరికొంతమంది దర్శకులుగా రాణిస్తున్నారు. వీరితో పాటు యాంకర్స్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనసూయ యాంకర్ నుంచి ఇప్పుడు యాక్టర్ గా మారారు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ అందాల భామ. మరోవైపు రష్మీ కూడా హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. వీరితో పాటు గతంలో సౌమ్య రావు అనే కన్నడ బ్యూటీ కూడా జబర్దస్త్ కు యాంకర్ గా చేసింది. వచ్చి రాని తెలుగుతో ఈ అమ్మడు ముద్దుముద్దుగా మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అయితే ఈ చిన్నది జబర్దస్త్ కు ఎక్కువ రోజులు యాంకర్ గా కొనసాగలేదు. ఇక ఇప్పుడు సిరిహనుమంతు యాంకర్ గా చేస్తోంది. ఇదిలా ఉంటే సౌమ్య రావు ఇతర షోలతో బిజీగా మారిపోయింది. అయితే సీరియల్ బ్యూటీ సౌమ్య రావు కెరీర్ లో ఎన్నో కష్టాలను చూసింది. ఆమె అంత ఈజీగా ఈ స్థాయికి రాలేదు. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా తెలిపింది. ఓ ఇంటర్వ్యూలో సౌమ్య రావు మాట్లాడుతూ.. తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను తెలిపింది.
నాకు తెలుగు రాకపోయినా తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు అని తెలిపింది సౌమ్య. అలాగే ఆమె మాట్లాడుతూ ” మా అమ్మే నాకు గురువు. ఆమె సంగీతం నేర్పుతూ మమ్మల్ని పోషించింది. మా కుటుంబం ఎన్నో కష్టాలను చూసింది. ఒకానొక సమయంలో ఆర్థికంగా దెబ్బతిన్నాం.. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితికి చేరుకున్నాం అదే సమయంలో మా అమ్మకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఆకలితో ఎదురుచూసేవాళ్ళం.. అందరూ తిన్న తర్వాత మిగిలింది ఎవరైనా తెచ్చి ఇస్తారని.. ఆ కష్టాలే మా జీవితాన్ని మరిచేశాయి. ఆ కష్టాలు నన్ను మానసికంగా మరింత బలంగా మార్చాయి అని తెలిపింది సౌమ్య రావు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.