ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెకు సోషల్ మీడియాలో భారీగానే క్రేజ్ ఉంది. తనకు సంబంధించిన విషయాలు గురించే కాదు, పలు సామాజిక అంశాలపై సైతం రష్మి స్పందిస్తుంది. ముఖ్యంగా మూగ జీవాలు అంటే తనకు ఇష్టం ఉండటంతో..వాటి జాగ్రత్తలకు సంబంధించిన పోస్టులు తరచుగా పెడుతూ ఉంటుంది. అంతేనా..వల్గర్ కామెంట్స్ పెట్టే ఆకతాయి నెటిజన్లకు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తుంది. తాజాగా ‘ఉమెన్స్ డే’ సందర్భంగా రష్మి పెట్టిన పోస్ట్ చర్చనీయాంశమైంది. ఒకవైపు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబతూనే దేశంలోని న్యాయవ్యవస్థపై తన మార్క్ సెటైర్లు వేసింది ఈ యాంకర్.
ఇండియాలో ఓ మహిళ 8 ఏళ్ల నుంచి తన కూతురుకి జరిగిన అన్యాయం గురించి న్యాయం కోసం పోరాటం చేస్తుంది అంటూ నిర్భయ అంశాన్ని ప్రస్తావించింది రష్మి. అటువంటి దేశంలో మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం అని ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో నిర్భయ తల్లి ఆశా దేవి కన్నీరు పెట్టుకున్న ఫోటో కూడా జతచేసి ఉంది. ఈ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.
#HappyWomensDay2020 pic.twitter.com/9vcTW6T5vM
— rashmi gautam (@rashmigautam27) March 8, 2020