Parasakthi Movie: అన్నా.. భలే తప్పించుకున్నావ్‌! ‘పరాశక్తి’ సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?

శివ కార్తికేయన్ హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పరాశక్తి. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైన ఈ తమిళ మూవీ ఫ్లాపుల జాబితాలో చేరిపోయింది. అయితే ఈ డిజాస్టర్ మూవీ మొదట ఓ టాలీవుడ్ స్టార్ హీరో దగ్గరకు వచ్చిందట.

Parasakthi Movie: అన్నా.. భలే తప్పించుకున్నావ్‌! పరాశక్తి సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?
Parasakthi Movie

Updated on: Jan 20, 2026 | 9:42 PM

మహా వీరుడు, అమరన్, మదరాసి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న శివ కార్తికేయన్ నటించిన తాజా చిత్రం పరాశక్తి. గతంలో గురు, ఆకాశమే హద్దురా వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి మన్ననలు లైడీ డైరెక్టర్ సుధ కొంగర ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శివకార్తికేయన్ తో పాటు రవి మోహన్ (జయం రవి), అధర్వ మురళి హీరోలుగా నటించారు. అలాగే
శ్రీలీల ఈ మూవీలో హీరోయిన్ గా చేసింది. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదంది. కానీ మొదటి షో నుంచే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. దీనికి తోడు పరాశక్తి సినిమాను వరుస వివాదాలు చుట్టుముట్టాయి. ఇక థియేటర్ల కొరతతో ఈ పరాశక్తి మూవీ అసలు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కాలేదు. దీంతో కేవలం తమిళంలో విడుదలైన పరాశక్తి సినిమా పెద్దగా ఆడలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు కలెక్షన్లు మాత్రమే రాబట్టింది. 1960లలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం, తదితర సంఘటనల ఆధారంగా పరాశక్తి సినిమాను తెరకెక్కించారు. అయితే శివ కార్తికేయన్ కంటే ముందు వేరే హీరోతో ఈ మూవీని తెరకెక్కించాలనుకున్నారట సుధ కొంగర.

ముందుగా పరాశక్తి సినిమా కథ టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ వద్దకు వెళ్లిందట. అయితే ఆ సమయంలో అతను కింగ్ డమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దీంతో ఈ సినిమాను చేయలేనని చెప్పేశాడట విజయ్. ఈ విషయాన్ని డైరెక్టర్ సుధ కొంగరే ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.  అలాగే సూర్యతో కూడా ఈ పరాశక్తి సినిమాను తీయాలనుకున్నారట ఈ లేడీ డైరెక్టర్. అలాగే జయం రవి చేసిన రోల్‌ కోసం దుల్కర్ సల్మాన్‌ని అనుకున్నారు.ఇక హీరోయిన్‌గా నజ్రియా నజీమ్‌ని కూడా ఎంపిక చేశారు. అయితే ఏమైందో తెలియదు కానీ అనూహ్యంగా ఈ మూవీ నుంచి సూర్య తప్పుకున్నాడు. ఆ తరవాత దుల్కర్ సల్మాన్, నజ్రియా కూడా బయటకు వచ్చారు. దీంతో వీరి ప్లేస్ లో శివ కార్తీకేయన్‌, అధర్వ మురళి, శ్రీలీల వచ్చారు. అయితే ఇప్పుడీ పరాశక్తి సినిమా ఫ్లాపుల జాబితాలో చేరడంతో విజయ్ దేవరకొండ భలే తప్పించుకున్నారని అతని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ కానీ..

సంక్రాంతి వేడుకల్లో విజయ్ దేవరకొండ..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..