
ఇప్పటివరకు తన కెరీర్ లో ఎక్కువగా మాస్ సినిమాలు చేసిన రవితేజ ఈసారి ఒక డివోషనల్ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ డివోషనల్ మూవీ ఇరుముడి. గతంలో మజిలి, నిన్నుకోరి వంటి ప్రేమకథా చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. టీజర్స్, సాంగ్స్, ట్రైలర్ తోనే పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసిన ఇరుముడి సినిమా శుక్రవారం (ఆగస్టు 21) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రజెంట్ సినిమా ట్రెండ్ అయిన సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీకి డివోషనల్ టచ్ ఇచ్చి ఈ సినిమాను తెరకెక్కించాడు శివ నిర్వాణ. అందుకు తగ్టట్టే థియేటర్లలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రవితేజకు గ్రేట్ కమ్ బ్యాక్ వచ్చినట్టేనని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఇరుముడి సినిమా రిలీజ్ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వార్త వైరల్ గా మారింది. అదేంటంటే.. ఇరుముడి సినిమాకు రవితేజ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఆయన కంటే ముందు మరో హీరోను ఈ మూవీ సంప్రదించారట మేకర్స్. అయితే ఆ హీరో పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో రవన్నను తీసుకున్నారట.
దర్శకుడు శివ నిర్వాణ ఇరుముడి కథను మొదట నాగచైతన్యకు వినిపించారట. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన మజిలీ సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా తర్వాత శివ మొదట నాగ చైతన్యను కలిసి ఈ ఇరుముడి స్క్రిప్ట్ వినిపించాడట. అతనికి కూడా ఈ కథ తెగ నచ్చేసిందట. అయితే అప్పటికే నాగ చైతన్య ఇతర సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడట. దీంతో ఇరుముడి సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. ఆ తర్వాతే మాస్ మహారాజ రవితేజ లైన్లోకి వచ్చాడట. ఇందులో నిజమెంతుంతో తెలియదు కానీ ఇరుముడి రిలీజ్ నేపథ్యంలో ఇప్పుడీ విషయం నెట్టింట బాగా వైరలవుతోంది. నాగ చైతన్య మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడేమోనని చాలా మంది సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.