Ramayana: రెమ్యునరేషన్ తక్కువైందని సీత పాత్రను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. అసలు విషయం చెప్పిన అందాల తార

గురువారం (నవంబర్ 05) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన రామాయణం సినిమాకు మొదటి రోజే భారీ కలెక్షన్లు వచ్చాయి. బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఫస్ట్ డేనే ఈ మూవీకి రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

Ramayana: రెమ్యునరేషన్ తక్కువైందని సీత పాత్రను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. అసలు విషయం చెప్పిన అందాల తార
Ramayana Movie

Updated on: Nov 06, 2026 | 10:11 PM

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ‘రామాయణం’ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. రూ. 4,000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా గురువారం (నవంబర్ 05) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. నటీనటుల యాక్టింగ్, నితేష్ తివారీ టేకింగ్ అన్నిటికీ మించి హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా విజువల్ ఎఫెక్ట్స్ వెరసి.. నేటి ఆడియెన్స్ కు ఆధునిక హంగులతో రామాయణాన్ని అద్భుతగా చూపించారు. నమిత్ మల్హోత్రాకు చెందిన ‘ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్’, యష్‌కు చెందిన ‘మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్’, ‘డీఎన్ఈజీ’ సంస్థలు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించాయి. రణ్ బీర్, సాయి పల్లవి, యశ్ ల తో పాటు సన్నీ డియోల్, శోభన, కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, హరీశ్‌ ఉత్తమన్‌, ఫైసల్‌ మాలిక్‌, వివేక్‌ ఒబెరాయ్‌, కునాల్‌ కపూర్‌, ముకేశ్‌ తివారి, అనుపమ్ ఖేర్, సౌరబ్‌ సచ్‌దేవ్‌, రవి దూబే, ఆదినాథ్‌ కొఠారే, నితీశ్‌ శర్మ.. ఇలా ఎంతో మంది స్టార్స్ ఈ సినిమాలో నటించారు. కాగా ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ రాముడిగా ఒదిగిపోయారు. అలాగే సీతమ్మ పాత్రలో సాయి పల్లవి అభినయం నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే ఈ రామాయణ సినిమాలో సాయి పల్లవి కంటే ముందు సీత పాత్ర కోసం పలువురు హీరోయిన్లు సంప్రదించారని వార్తలు వచ్చాయి. అయితే వివిధ కారణాలతో వారు ఈ పాత్రను తిరస్కరించారని రూమర్లు వినిపించాయి. అందులో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ కూడా ఉంది. తాజాగా ఇదే విషయంపై ఆమె పూర్తి క్లారిటీ ఇచ్చింది.

కాగా సాయి పల్లవి కంటే ముందే కరీనా కపూర్‌కు సీత పాత్రను ఆఫర్ చేశారని, అయితే ఆమె ఎక్కువ పారితోషికం అడిగారని, అందుకే ఆమెను తీసుకోలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు పూర్తిగా అబద్ధమని నటి కరీనా స్వయంగా ఖండించింది. సీత పాత్ర కోసం తనకు ఎటువంటి ఆఫర్ రాలేదని కరీనా స్పష్టం చేసింది. అసలు ఈ సినిమా కోసం తనతో ఎలాంటి చర్చలు జరగలేదని కూడా ఆమె పేర్కొంది. తద్వారా రెట్టింపు పారితోషికం డిమాండ్ చేసినందుకే కరీనా కపూర్‌ను సినిమా నుంచి తొలగించారన్న వదంతులలో ఏమాత్రం నిజం లేదని స్పష్టమైంది.

కాగా కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి కూడా సీత పాత్ర కోసం ఆడిషన్స్ ఇచ్చింది. అయితే దర్శక నిర్మాతలు ఆమెను సెలెక్ట్ చేయలేదు. ఈ విషయాన్ని శ్రీనిధి శెట్టినే స్వయంగా చెప్పుకొచ్చింది. రామాయణం సినిమా రిలీజ్ నేపథ్యంలో మరోసారి ఈ వార్తలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us