Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆ తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా.?

మెగా ప్రిన్ వరుణ్ తేజ్ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముకుంద సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు వరుణ్ తేజ్.

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆ తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా.?
Varun Tej
Follow us

|

Updated on: Sep 24, 2022 | 8:21 AM

మెగా ప్రిన్ వరుణ్ తేజ్(Varun Tej) సినిమా కోసం ఆయన అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముకుంద సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు వరుణ్ తేజ్. ఆ తర్వాత వరుస సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచుకున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గద్దల కొండ గణేష్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు వరుణ్. ఇక ఈ మధ్య రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు ఈ మెగా హీరో.. వాటిలో గని సినిమా ఒకటి కిరణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. అలాగే అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 3. ఈ సినిమా ప్రేక్షకులను నవ్వించి మంచి సక్సెస్ గా నిలించింది. దాంతో ఇప్పుడు వరుణ్ ఎవరితో సినిమా చేయనున్నడన్నది ఆసక్తిగా మారింది.

అయితే తన నెక్స్ట్ సినిమా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేయనున్నాడు వరుణ్. ఇటీవలే ఈ సినిమా పూజాకార్యక్రమాలు కూడా జరిగాయి. ప్రవీణ్ ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న గోస్ట్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే ఇప్పుడు ఓ తమిళ్ దర్శకుడితో చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది.  తమిళ్ లో అర్జున్ రెడ్డి సినిమా తెరకెక్కించిన గిరీశయ్య తో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. గిరీశయ్య ప్రస్తుతం మెగాహీరో వైష్ణవ్ తేజ్ తో ‘రంగ రంగ వైభవంగా’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే వరుణ్ తో గిరీశయ్య కథ గురించి చర్చలు కూడా జరిపారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి