Anasuya Bharadwaj : అందాల యాంకర్ గా బుల్లితెరపైన తనదైన ముద్ర వేశారు అనసూయ. టీవీ షోలతోపాటు సినిమాల్లోనూ నటిస్తూ అలరిస్తుంది అనసూయ. ఈ అమ్మడు అందానికి అభినయానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఇక అనసూయ సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా మంచి నటనతో ఆకట్టుకుంది అనసూయ. ఆతర్వాత చాలా సినిమాల్లో నటిస్తూ.. కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరుస్తూ అలరిస్తుంది.
అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమాలో అవకాశం దక్కించుకుంది. అనసూయను ఉద్దేశించి రమేష్ వర్మ ట్వీట్ ద్వారా స్వాగతం పలికిన విషయం తెలిసిందే. ఇటీవల క్రాక్ సినిమాతో ట్రాక్ లోకి వచ్చిన మాస్ రాజా రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని తెలుస్తుంది. ‘ఖిలాడి’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఖిలాడి సినిమాలో అనసూయ నెగిటివ్ రోల్స్ లో కనిపించనుందని అంటున్నారు. గతంలో అడవి శేష్ నటించిన ‘క్షణం’ సినిమాలో అనసూయ నెగిటివ్ పాత్రలో నటించి మెప్పించింది. తాజాగా మరోసారి ఆమె విలన్ గా ఆకట్టుకొనుందని తెలుస్తుంది. ఖిలాడి సినిమా మే 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో పాటు అనసూయ రంగమార్తాండా పుష్ప సినిమాల్లో కూడా నటిస్తోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Mahesh Babu and Tamanna : మహేష్ బాబుతో మరోసారి మిల్కీబ్యూటీ.. కానీ ఈ సారి ఇలా..