Daali Dhananjaya: జీవితంలో అసలు పెళ్లే చేసుకోనన్న జాలి రెడ్డి.. చివరకు ఆ ఒక్కరి కోసం డాక్టరమ్మతో ఏడడుగులు

పుష్ప ఫేమ్, కన్నడ స్టార్ నటుడు డాలీ ధనంజయ్ మరికొన్ని గంటల్లో పెళ్లిపీటలెక్కనున్నాడు. ఆదివారం (ఫిబ్రవరి 16) మైసూరులో అతని వివాహం డాక్టర్ ధన్యతతో జరగనుంది. శనివారం (ఫిబ్రవరి 15) రాత్రి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. డైరెక్టర్ సుకుమార్ హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు.

Daali Dhananjaya: జీవితంలో అసలు పెళ్లే చేసుకోనన్న జాలి రెడ్డి.. చివరకు ఆ ఒక్కరి కోసం డాక్టరమ్మతో ఏడడుగులు
Daali Dhananjaya Wedding

Updated on: Feb 15, 2025 | 8:29 PM

అల్లు అర్జున్ నటించిన పుష్ఫ, పుష్ప 2 సినిమాల్లో జాలి రెడ్డిగా ఆకట్టుకున్నాడు కన్నడ నటుడు డాలీ ధనంజయ. ఇందులో అతని పాత్రకు మంచి పేరొచ్చింది. దీంతో పాటు సత్యదేవ్ హీరోగా నటించిన జీబ్రా సినిమాలోనూ ఓ కీలక పాత్రలో ఆకట్టుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. సినిమాల సంగతి పక్కన పెడితే డాలీ ధనుంజయ్ మరికొన్ని గంటల్లో పెళ్లిపీటలెక్కనున్నాడు. ధన్యత అనే అమ్మాయితో కలిసి మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. ఆదివారం (ఫిబ్రవరి 16) మైసూరు వేదికగా వీరి వివాహం అట్టహాసంగా జరగనుంది. వివాహ వేడుకకు ముందు శనివారం (ఫిబ్రవరి 15) రాత్రి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ కూడా రిసెప్షన్ వేడుకకు హాజరై కాబోయే జంటకు అభినందనలు తెలిపారు.

కాగా ధనంజయ్- ధన్యత గతేడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. కాగా ధనంజయ పెళ్లి వెనక ఒక ఆసక్తికరమైన స్టోరీ దాగుంది. అదేంటంటే.. ధనంజయ అసలు పెళ్లే చేసుకోనని ఇంట్లో తెగ సతాయించేవాడట! దీంతో అతడిని ఎలా ఒప్పించాలా? అని తల్లి సావిత్రమ్మ తెగ టెన్షన్‌ పడిపోయిందట. పెళ్లి చేసుకోమ్మని గత ఐదేళ్లుగా వెంట పడుతోందట. దీంతో అమ్మ మాట కాదనలేక ఎట్టకేలకు పెళ్లికి ఒకే చెప్పాడట ధనంజయ. ఎట్టకేలకు తన కుమారుడి పెళ్లి శుభకార్యం జరుగుతుండటం సంతోషంగా ఉందంటోంది సావిత్రమ్మ.

ఇవి కూడా చదవండి

డాలీ ధనుంజయ్ వివాహ రిసెప్షన్ లో డైరెక్టర్ సుకుమార్..

డాలీ ధనంజయ్ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. సుమారు 30 వేల మంది దాకా ఈ వేడుకకు హాజరు కావొచ్చని సమాచారం. ఇక రిసెప్షన్ లో భాగంగా 3 ఎకరాల స్థలంలో ఒక పెద్ద డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు. ఇందులో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసి, ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అభిమానులకు అందించే ఆహారాన్ని సెలబ్రిటీలకు కూడా అందిస్తున్నారట.

ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో డాలీ ధనంజయ్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..