మహేశ్ బాబు సోదరుడి కుమారుడి సినిమా.. ఈ బ్యూటీ ఆ టాలీవుడ్ హీరోయిన్ కూతురని తెలుసా? బ్యాక్ గ్రౌండ్ ఇదే

మహేష్ బాబు సోదరుడు, దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ ఈ సినిమాతో హీరోగా టాలీవుడ్ కు పరిచయం కానున్నాడు. ఆర్ ఎక్స్ 100, మంగళవారం సినిమాలతో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

మహేశ్ బాబు సోదరుడి కుమారుడి సినిమా.. ఈ బ్యూటీ ఆ టాలీవుడ్ హీరోయిన్ కూతురని తెలుసా? బ్యాక్ గ్రౌండ్ ఇదే
Srinivasa Mangapuram Movie

Updated on: Apr 16, 2026 | 6:52 PM

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడు. సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్‌ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతను నటిస్తోన్న మొదటి సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. ఆర్‌ఎక్స్‌ 100, మంగళవారం చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న‌ అజయ్‌ భూపతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ‘శ్రీనివాస మంగాపురం’ పుణ్య క్షేత్రం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ ఇంటెన్స్ డ్రామాలో బాలీవుడ్ హీరోయిన్ రషా తడానీ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ఆమెకు ఇదే మొదటి సినిమా. ఓ వైపు నటిగానే కాకుండా గాయనిగానూ సత్తా చాటుతోందీ అందాల తార. అజాద్ సినిమాలోని ఉయ్‌ అమ్మ’ అనే పాటతో బాగా పాపులర్‌ అయింది రషా తడానీ. ఇప్పుడు శ్రీనివాస మంగాపురం సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం కానుందీ అందాల తా. అన్నట్లు ఈ బ్యూటీ మరెవరో కాదు ఒకప్పుడు బాలీవుడ్ ను ఏలిన స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు. హిందీలో వందలాది చిత్రాల్లో నటించిన రవీనా తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. బంగారు బుల్లోడు సినిమాలో బాలకృష్ణ తో కలిసి నటించిందీ అందాల తార. అలాగే రథ సారథి, ఆకాశ వీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద సినిమాల్లోనూ కనిపించిందీ రవీనా. ఇక ఆ మధ్యన కేజీఎఫ్ 2 సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషించి పాన్ ఇండియా ఫేమస్ అయిపోయిందీ ముద్దుగుమ్మ. ఇక రవీనా అడుగుజాడల్లోనే నడుస్తోంది ఆమె కూతురు రషా తడానీ.

 

ఇవి కూడా చదవండి

ఇప్పటికే బాలీవుడ్ లో సత్తా చాటిన రషా శ్రీనివాస మంగాపురంతో తెలుగు ఆడియెన్స్ ను పలకరిస్తోంది. ఇందులో ఆమె మంగా అనే పాత్రలో నటిస్తోంది. బుధవారం (ఏప్రిల్ 15) రిలీజైన ఈ సినిమా టీజర్ లో చాలా అందంగా కనిపించింది రవీనా కూతురు. దీంతో ఇప్పుడీ ముద్దుగుమ్మ పేరు తెగ వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే నరేష్, అజయ్ తదితరులు వివిధ పాత్రల్లో కనిపించనున్నారు. అగ్ర నిర్మాత అశ్విని దత్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని పి కిరణ్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

తల్లి రవీనాటాండన్ తో..

శ్రీనివాసా మంగాపురం టీజర్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us