
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది. చాలా సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. పాన్ ఇండియా సినిమా అంటే మినిమమ్ 100కోట్లు బడ్జెట్ తో తెరకెక్కుతుంటాయి. అయితే పాన్ ఇండియా సినిమాలు కాకుండా చిన్న బడ్జెట్ తో వచ్చి భారీగా వసూళ్లు రాబట్టిన సినిమాలు కూడా కోనున్నాయి. అయితే ఒక సినిమా కేవలం 2000 వేలతో తెరకెక్కి 70 లక్షలు వసూల్ చేసింది. వినడానికే షాకింగ్ గా ఉంది కదా.. అవును ఇది నిజమే సినిమాల్లో కొత్త కొత్తగా చేయాలంటే ముందు వరసలో ఉండే వారిలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకరు. కేవలం 2000 రూపాయల బడ్జెట్‌తో 70 లక్షల రూపాయల లాభాలను ఆర్జించిన స్మార్ట్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రామ్ గోపాల్ వర్మ.
రెండు దశాబ్దాల క్రితం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కొత్త ఒరవడిని సృష్టించిన రామ్ గోపాల్ వర్మ.. ఇటీవల కొని వివాదాస్పద, డి-గ్రేడ్ చిత్రాలను తీశారనే ఆరోపణలు వచ్చాయి. అసలు విషయం ఏంటంటే.. వర్మ ఎలాంటి సినిమా తీసినా లాభాలు మాత్రం వస్తాయి. వర్మ ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు చేస్తున్నారు. తన పై వస్తున్న విమర్శలపై వర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘సినిమా విజయాన్ని మీరు వేరుగా చూస్తారు, నేను దానిని మరోలా చూస్తాను. నా సినిమాలకు వసూళ్లు రావు అని కొందరు ఫ్లాప్ అని తేల్చేస్తున్నారు. కానీ నిజం వేరు అన్నారు వర్మ.
లాక్ డౌన్ సమయంలో మూడు సినిమాలు చేశా.. వాటిలో ఒక సినిమాని మొబైల్‌లో మాత్రమే షూట్ చేసి, మొబైల్‌లో ఎడిట్ చేసి, పే-పర్-వ్యూ మోడల్‌లో ఇంటర్నెట్‌లో విడుదల చేశాం. ఆ సినిమా చేయడానికి నాకు కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయి. అయితే ఆ సినిమా వసూళ్లు 70 లక్షల రూపాయలు. దీన్ని ఫ్లాప్ అంటారా? అని వర్మ ప్రశ్నించారు. రామ్ గోపాల్ వర్మ ‘నేకెడ్’ సినిమా 70 లక్షలు రాబట్టింది. ఈ సినిమాను ఓ ఇంట్లో షూట్ చేశారు వర్మ. సినిమాలో చాలా తక్కువ మంది నటీనటులు ఉన్నారు. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. భార్యాభర్తలు, ఓ పనిమనిషి మధ్య జరిగే కథతో సాగుతుంది. ఇది పూర్తి సినిమా కాదు షార్ట్ ఫిల్మ్. ఈ చిత్రం పర్ వ్యూ మోడల్‌లో భారీ మొత్తాన్ని రాబట్టింది. ‘నేకెడ్’ సినిమా కంటే ముందు వర్మ ‘క్లైమాక్స్’ అనే సినిమాను డైరెక్ట్ చేసి నిర్మించారు. ఆ సినిమాను మొత్తం అవుట్‌డోర్‌లో చిత్రీకరించారు. ఈ సినిమాలో శృంగార తార మియా మాల్కోవా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను కూడా పే పర్ వ్యూ పద్దతిలో వర్మ విడుదల చేశారు. ఈ సినిమా కోటికి పైగా కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఆర్జీవీ వ్యూహం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
— Ram Gopal Varma (@RGVzoomin) February 10, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.