iBOMMA: ఐబొమ్మ పేరు వెనుక గుట్టు విప్పేసిన రవి.. తన ఇంటి పేరు అని కాదు…

ఐబొమ్మ.. దీని పేరెత్తని నోరు లేదిప్పుడు. గత 15 రోజుల నుంచి తెలుగు స్టేట్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో నడుస్తోందీ టాపిక్. ఐబొమ్మ రవి అరెస్ట్ అవడం, పైరసీ వెబ్‌సైట్‌ను క్లోజ్ చేయడం.. ఒక వర్షన్ మాత్రమే. తాజాగా పోలీసులు విచారణలో రవి కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం...

iBOMMA: ఐబొమ్మ పేరు వెనుక గుట్టు విప్పేసిన రవి.. తన ఇంటి పేరు అని కాదు...
Ibomma Ravi

Edited By: Ram Naramaneni

Updated on: Nov 29, 2025 | 7:21 PM

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఐ బొమ్మ రవి కేసులో మరో ఆసక్తికర విషయం బయటపడింది. అసలు తన పైరసీ వెబ్‌సైట్‌కు ఐ బొమ్మ అనే పేరును ఎందుకు ఇచ్చాడో పోలీసులకు రవి క్లియర్ కట్‌గా చెప్పేసినట్లు సమాచారం.  రవి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌ని విశాఖపట్నం. వైజాగ్‌లో సినిమాను బొమ్మ అని పిలుస్తూ ఉంటారు. అంటే బొమ్మ బ్లాక్ బాస్టర్.. బొమ్మ యావరేజ్ ఇలా అనమాట.  సో బేసిక్‌గా వైజాగ్ నుంచి వచ్చిన రవి.. తన నేటీవ్ భాష ప్రకారం సగ భాగానికి బొమ్మ అని ఎంచుకున్నాడు. ప్రేక్షకులకు తెర మీద కనిపించే బొమ్మను కాకుండా… తాను సొంతంగా ఇంటర్నెట్ ద్వారా బొమ్మను చూపించాలని అనుకున్నాడు. అందుకే తన పైరసీ వెబ్‌సైట్‌కు I – internet కలిసి ఐబొమ్మ అని పేరు పెట్టాడు. వాస్తవానికి తన ఇంటి పేరు ఇమంది కాబట్టి.. అలా ఐ పెట్టాడేమో అనుకున్నారు.. కానీ తాజాగా అతనే గుట్టు విప్పేశాడు.

అమీర్‌పేట నుంచి అమెరికాకు వెళ్లి.. అక్కడి నుంచి కరేబియన్ దీవులకు చెక్కేసిన  రవి చేసిన ఆపరేషన్ అంతా ఇంతా కాదు. తను ఎక్కడ ఉన్నా సరే నేటివిటీకి తగ్గట్టుగా వెబ్‌సైట్ పేరును డిజైన్ చేసినట్టు పోలీసులు దర్యాప్తులో రవి వెల్లడించాడు.  ఒక్క ఐ బొమ్మ అనే పేరుతోనే రవి ఏకంగా 65 పైగా మిర్రర్ డొమైన్లను ఉపయోగించి వెబ్‌సైట్స్‌ క్రియేట్ చేశాడు. తన ఐ బొమ్మ పోస్టర్ డిజైన్ చేసింది మరెవరో కాదు. తాను ఒకప్పుడు ఉద్యోగం చేసిన వెబ్ డిజైనింగ్‌లో భాగంగా నిఖిల్ అనే వ్యక్తికి చెందిన కంపెనీకి వెబ్‌సైట్ డిజైన్ చేసి ఇచ్చాడు. ఇప్పుడు అదే స్నేహితుడు నిఖిల్ చేత తన IBOMMA వెబ్సైట్ పోస్టర్‌ను రవి డిజైన్ చేయించాడు.

ఇప్పటికే రవిని ఎనిమిది రోజులపాటు పోలీసులు కస్టడీలో విచారించారు. పోలీసుల కస్టడీలో రవి చాలా విషయాలకు సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. మరోవైపు రవిని పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తరలించే సమయంలో పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడా రవి ఫేస్ రివిల్ కాకుండా మొత్తం బ్లాక్ షర్ట్ బ్లాక్ ప్యాంట్‌తో పాటు మాస్క్ ధరించారు..