
టాలీవుడ్ నటుడు హైపర్ ఆది తన కష్టకాలం, విజయాల వెనుక ఉన్న అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. బీటెక్ 80 శాతం మార్కులతో పూర్తి చేసి, ఒక కంపెనీలో ఉద్యోగం చేశానన్నాడు. అయితే, ముగ్గురు సోదరుల చదువుల కోసం కుటుంబం చేసిన దాదాపు 20 లక్షల అప్పును తీర్చడానికి అతడి జీతం సరిపోలేదు. జాబ్ సంతృప్తికరంగా లేకపోవడంతో, ఆ అప్పును తీర్చాలనే ఆలోచనతో తన కుటుంబానికి చెందిన మూడు ఎకరాల పొలాన్ని అమ్మకం పెట్టానని చెప్పాడు.
ఉద్యోగంపై ఆసక్తి లేకపోవడంతో.. శని, ఆదివారాల్లో కృష్ణకాంత్ పార్క్‌లో ఫోన్‌తో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీసి యూట్యూబ్‌లో పెట్టేవాడట. అత్తారింటికి దారేది క్లైమాక్స్ స్పూఫ్‌కు లక్ష వ్యూస్ రావడంతో, అదిరే అభి నుంచి మెసేజ్ వచ్చిందని.. తద్వారా జబర్దస్త్‌లోకి అడుగుపెట్టానని హైపర్ ఆది తెలిపాడు. తాను ఉద్యోగం మానేసిన తర్వాత తల్లిదండ్రులు బాధపడ్డారని చెప్పుకొచ్చాడు. జబర్దస్త్‌లో మొదట చిన్న రోల్స్ చేశాక, బంధువులు విమర్శించారు. మూడు-నాలుగు నెలలు ఇంటికి ఫోన్ చేయలేదు. కష్ట కాలంలో బంధువుల లేడీస్ హాస్టల్‌లో కింద గదిలో ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉన్నాను.
కేవలం ఆర్టిస్ట్‌గా నెట్టుకురావడం కష్టం అని తెలుసుకుని, స్కిట్‌లకు డైలాగులు రాయడం మొదలుపెట్టానని హైపర్ ఆది తెలిపాడు. అభి అన్న లేని సమయంలో ఒక స్కిట్‌కు పూర్తిగా డైలాగులు రాసి హిట్ కొట్టానన్నాడు హైపర్ ఆది. ఆ తర్వాత రైటర్‌గా, ఆర్టిస్ట్‌గా ఎదిగి, చివరకు నాగబాబు, రోజా, నితిన్ భరత్ లాంటివారి ప్రోత్సాహంతో టీమ్ లీడర్‌గా మారానని చెప్పుకొచ్చాడు. అప్పు తీర్చడానికి అమ్మిన పొలం కంటే ఎక్కువ భూమిని తిరిగి కొనుగోలు చేయడంతో పాటు.. ఆర్ధికంగా కూడా స్థిరపడ్డానని స్పష్టం చేశాడు హైపర్ ఆది.
ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఐదుగురు అమ్మాయిలతో ఓ రాత్రి గడిపారని చెప్పాడు.. అది విని షాకయ్యా
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..