టాలెంటెడ్ హీరో అడవి శేష్ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి నెలకొంటుంది. కెరీర్ స్టార్టింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసిన శేష్.. ఆ తర్వాత హీరోగా మారి మంచి విజయాలను అందుకున్నాడు. క్షణం, ఎవరు, గూఢచారి లాంటి సినిమాతో మంచి హిట్స్ అందుకున్నాడు శేష్. ఇక రీసెంట్ గా వచ్చిన మేజర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఉగ్రమూకల నుంచి ఎంతో మంది ప్రాణాలను కాపాడి.. వీరత్వం పొందిన వీరుని కథలో మనకు కనిపించారు. మేజర్ ఉన్ని కృష్ణన్‌గా పాన్ ఇండియన్ రేంజ్‌లో అలరించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు శేష్. ఇక ఈ సినిమా థియేటర్స్ లో ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుందో.. ఓటీటీలోనూ అదే రేంజ్ లో భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు హిట్2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
శైలేష్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్రయూనిట్.
ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి దర్శక ధీరుడు రాజమౌళి గెస్ట్ గా హాజరు కానున్నారు . ఇక అడవి శేష్ నటిస్తున్న ఈ సినిమాకు నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హిట్ 2 సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. హిట్ 2 డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.