తన అందంతో, నటనతో కుర్రకాను తన మాయలో పడేసిన బ్యూటీల్లో టబు(Actress Tabu )ఒకరు. ఒకప్పుడు ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్లే.. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసిన రాణించింది టబు. ఆ తరం సూపర్ స్టార్స్ అందరితో నటించి ఆకట్టుకుంది టబు. అయితే ఈ అమ్మడు ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పటికే ఈ అమ్మడు ఐదుపదుల వయసులోకి అడుగుపెట్టింది. అయినా కూడా పెళ్లి గురించి మాత్రం ఆలోచించడంలేదు ఈ బ్యూటీ. అయితే ఆ మధ్య ఓ టాలీవుడ్ స్టార్ హీరోతో ప్రేమలో పడిందని టాక్ గట్టిగా వినిపించింది. అయితే ఆ వార్తల పై టబు పెద్దగా రియాక్ట్ కాలేదు. తాజాగా ఈ అమ్మడు పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తాజాగా ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ టబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మీరు ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు.. ఆ విషయం గురించి ఎందుకు ఆలోచిండలేదు.. మీకు అమ్మ అని పిలిపించుకోవాలని లేదా..? అని ప్రశ్న ఎదురైంది. దానికి టబు సమాధానం ఇస్తూ.. “తల్లి అవ్వాలనుకుంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అని షాక్ ఇచ్చింది టబు. పెళ్ళి కాకుండానే తల్లికావచ్చు.. సరోగసి ద్వారా కూడా తల్లి అయ్యే అవకాశం ఉంది. నేను కావాలంటే అలా కూడా చేస్తా..నన్ను ఎవరూ ఆపరు. అయినా పెళ్లి కాకపోయినా.. పిల్లల్ని కనకపోయినా చచ్చిపోతామా ” అని టబు సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం యాక్టింగ్ కెరీర్ ను ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది టబు. ప్రేమకు, పెళ్ళికి వయసుతో సంబంధం లేదు అని.. అస్సలు దేనికి వయసుతో సంబంధం లేదు అని చెప్పికొచ్చింది ఈ సీనియర్ బ్యూటీ. టబు వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.