సాయి పల్లవి ఈ ముద్దుగుమ్మ గురించి తెలియని సౌత్ ప్రేక్షకులు ఉండరు. ముఖ్యంగా టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఈ చిన్నదానికి యమా క్రేజ్ ఉంది. లేడీ పవర్ స్టార్ గా ఆమెను పిలుస్తుంటారు. ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన పల్లవి.. తొలి సినిమాతోనే తన సహజ నటనతో పేక్షకులు మెప్పించింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తోంది ఈ చిన్నది. గత కొంతకాలంగా సాయి పల్లవి నుంచి కొత్త సినిమా అప్డేట్స్ ఏమి రాలేదు. దాంతో ఆమె సినిమాలు మానేస్తుందంటూ రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా సాయి పల్లవి ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సాయి పల్లవి తన సినిమాల అప్డేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. తాజాగా తన చెల్లి పుట్టున రోజున కొన్ని ఫొటోస్ షేర్ చేసి ఎమోషనల్ కోట్ రాసుకొచ్చింది ఈ లేడీ పవర్ స్టార్.
సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నన్ పుట్టిన రోజు సందర్భంగా ఫోటోలు షేర్ చేసింది సాయి పల్లవి. హ్యాపీ బర్త్ డే మై మంకీ.. మంచి సిస్టర్ కావాలనే తపనతో నన్ను మనిషిగా మార్చి ఎన్నో విషయాలను నేర్పించావు. నా సంతోషానివి, నా ప్రేమ నువ్వే థాంక్యూ చెల్లి ఐ లవ్ యు అంటూ రాసుకొచ్చిది సాయి పల్లవి. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.