
ఇటీవల తెలుగు ఇండస్ట్రీలో ఇతరభాషలనుంచి కొత్త అందాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కొత్త భామలు టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ముద్దుగుమ్మ కూడా వస్తోంది. ఆ అమ్మడి పేరే ఆషిక రంగనాథన్. కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ అమిగోస్. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ జోడీగా ఆషిక రంగనాథ్ తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇక రీసెంట్ గా వచ్చిన ఎన్నో రాత్రులొస్తాయి గాని అనే సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ పాట చూసిన ప్రతిఒక్కరు ఆషిక గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ అమ్మడి గురించే గూగుల్ లో గాలిస్తున్నారు.
చూడచక్కని రూపంతో.. ముద్గమనోహరంగా ఉంది ఈ భామ. ఈ అమ్మడి అందానికి కుర్రకారంతా ఒడ్డున పడ్డ చేపపిల్లలా గిలగిలా కొట్టేసుకుంటున్నారు. అమిగోస్ ప్రమోషన్స్ లో చాలా చురుకుగా పాల్గొంటుందో ఆషిక. తాజాగా ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది.
తనకు దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో చేయాలని ఆశగా ఉందని అదే తన డ్రీమ్ అమీ తెలిపింది ఆషిక. హీరోయిన్ గా ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా రాజమౌళిగారి దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలనుకుంటారు. ఆయన సినిమాలో చేయాలనేదే నా డ్రీమ్ కూడా అని తెలిపింది. ఇక అమిగోస్ సినిమా తర్వాత ఈ భామకు తెలుగులో వరుస ఆఫర్స్ రావడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ బ్యూటీ తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారుతుందేమో చూడాలి.