AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: బాలకృష్ణ కాళ్లు మొక్కిన స్టార్ హీరోయిన్.. మా బాలయ్య బంగారం అంటున్న నెటిజన్స్

నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. 60 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేస్తున్నారు. మాస్ యాక్షన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో కుర్ర హీరోలకు సైతం గట్టిపోటీ ఇస్తున్నారు బాలయ్య.

Balakrishna: బాలకృష్ణ కాళ్లు మొక్కిన స్టార్ హీరోయిన్.. మా బాలయ్య బంగారం అంటున్న నెటిజన్స్
Balakrishna
Rajeev Rayala
|

Updated on: Jun 14, 2025 | 8:31 AM

Share

నటసింహం నందమూరి బాలకృష్ణ లైనప్ చేసిన సినిమాలు చేస్తే మతిపోతుంది. కుర్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమాలు చేసి మెప్పిస్తున్నారు బాలకృష్ణ. రీసెంట్ డేస్ లో బాలయ్య నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి. మాస్ యాక్షన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు. ఒక్కో సినిమాకు రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతూ.. నందమూరి లెగసీని చెక్కు చెదరకుండా కాపాడుతున్నారు. ఇటీవల వరుసగా 4 సినిమాలతో రూ.100 కోట్లపైగా కలెక్షన్స్ రాబట్టారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ అవార్డ్ సైతం స్వీకరించారు. ఇటీవలే బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా అఖండ 2 సినిమా నుంచి వీడియో గ్లింప్స్ విడుదల చేశారు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇక ఇప్పుడు అఖండ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు బాలయ్య. బాలకృష్ణ సినిమాలతో పపాటు రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. వీటితో పాటు ఈ మధ్య షాపింగ్ మాల్ ఓపినింగ్స్ లోనూ సందడి చేస్తున్నారు బాలయ్య. తాజాగా బాలకృష్ణ ఏలూరులో సందడి చేశారు. బాలయ్యతో పాటు హీరోయిన్ సంయుక్తమీనన్ కూడా ఏలూరులో సందడి చేసింది.

ఏలూరు నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన నగల దుకాణాన్ని బాలకృష్ణ, హీరోయిన్ సంయుక్తమీనన్ కలిసి ప్రారంభించారు. బాలకృష్ణ, సినీ నటి సంయుక్తను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కాగా ఈ సందర్భంగా బాలకృష్ణ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంది సంయుక్తమీనన్. బాలయ్య ఆమెను దీర్ఘాయుష్మాన్ భవ అంటూ దీవించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలయ్య గొప్ప మనసు, మా బాలయ్య బంగారం.. అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

బాలకృష్ణ కాళ్లు మొక్కిన సంయుక్త మీనన్..

View this post on Instagram

A post shared by Samyuktha (@iamsamyuktha_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!