Vijay Deverakonda : శరవేగంగా విజయ్ దేవరకొండ ‘లైగర్’ షూటింగ్.. హిందీ వర్షన్ కు సొంతంగా డబ్బింగ్ చెప్పనున్న క్రేజీ హీరో..?

|

Feb 19, 2021 | 7:19 AM

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాద్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకు 'లైగర్' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది

Vijay Deverakonda : శరవేగంగా విజయ్ దేవరకొండ లైగర్ షూటింగ్.. హిందీ వర్షన్ కు సొంతంగా డబ్బింగ్ చెప్పనున్న క్రేజీ హీరో..?
Follow us on

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాద్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకు ‘లైగర్’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషాల్లో రూపొందుతున్న ఈ సినిమాను సెప్టెంబర్‌ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఛార్మీ, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా హిందీ వర్షన్ కు విజయ్ దేవరకొండ సొంతగా డబ్బింగ్ చెప్పనున్నాడట. ఇప్పుడు ఈ వార్త ఫిలిం నగర్ లో చాక్కర్లు కొడుతుంది. విజయ్ హైదరాబాదీ కుర్రాడు కావడంతో హిందీ మాట్లాడగలుగుతాడు.. కానీ మనదగ్గర కొంచం ఉర్దూ మిక్స్ అయ్యి ఉంటుంది. కానీ బాలీవుడ్ లో ప్యూర్ హిందీ మాట్లాడుతారు. కాబట్టి విజయ్ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. ఈ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి ఇప్పుడు డబ్బింగ్ లో సక్సెస్ అయితే ఫ్యూచర్ సినిమాలకు ఇబ్బంది ఉండదు. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ఇటీవల విడుదలైన ‘లైగర్’ పోస్టర్ లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

ఆ సినిమాలన్నీ ఒక ఎత్తయితే.. ‘చెక్’ మరో ఎత్తు.. మీడియా సమావేశంలో హీరో నితిన్

Pawan Kalyan : బండ్ల‌ గ‌ణేశ్‌తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవర్ స్టార్.. దర్శకుడు అతడేనా..?