Vishwanath And Sons: ఫ్యామిలీ సినిమాలకు ప్రేక్షకులు మళ్ళీ లైఫ్ ఇచ్చారు : హీరో సూర్య

సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథా చిత్రంగా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టింది.

Vishwanath And Sons: ఫ్యామిలీ సినిమాలకు ప్రేక్షకులు మళ్ళీ లైఫ్ ఇచ్చారు : హీరో సూర్య
Suriya

Updated on: Aug 16, 2026 | 6:51 AM

తమిళ అగ్ర కథానాయకుడు సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. ప్రతిభ గల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటించారు. రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథా చిత్రంగా ఆగస్టు 14, 2026న థియేటర్లలో అడుగుపెట్టిన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రధాన తారాగణం అద్భుతమైన నటన, వెంకీ అట్లూరి రచనలోని బలం, సాంకేతిక నిపుణుల పనితీరు.. ఇలా అన్ని అంశాలు చక్కగా కుదిరి ‘విశ్వనాథ్ & సన్స్’ను గొప్ప చిత్రంగా మలిచాయి. అందుకే ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తూ, వసూళ్ళ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం, హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ లో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకోవడంతో పాటు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొనడం విశేషం.

హీరో సూర్య మాట్లాడుతూ.. “మీరు చూపిస్తున్న ప్రేమకు కృతఙ్ఞతలు చెప్పడానికి మాటలు కూడా సరిపోవడం లేదు. త్రివిక్రమ్ గారు ఈ వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయన రాకతో ఇది మరింత ప్రత్యేకంగా మారింది. త్రివిక్రమ్ గారి ఆశీస్సులు, ప్రేమ, మద్దతు వల్లే ఈ సినిమా సాధ్యమైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో నా ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నాగవంశీ గారితో మరిన్ని సినిమాలు చేయాలని, మరిన్ని ఙ్ఞాపకాలు మూట కట్టుకోవాలని కోరుకుంటున్నాను. వెంకీ, వంశీ గారు తెలుగువారు. నేను తమిళనాడు, మమితా కేరళ, రవీనా గారు మహారాష్ట్ర. మేమందరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చాము, విభిన్న భాషలు మాట్లాడతాం.. అందరం కలిసి ఒక మంచి సినిమా చేశాము. దానిని మీరు ఆదరిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేమను కురిపిస్తూ.. ఫ్యామిలీ సినిమాలకు ప్రేక్షకులు మళ్ళీ లైఫ్ ఇచ్చారు. అన్ని ప్రాంతాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుంది. ఈ సినిమా పట్ల ప్రేక్షకులు ప్రేమను, గౌరవాన్ని చూపిస్తున్నారు. మా అందరికీ ఫ్యామిలీ జానర్ ఎంత ముఖ్యమో మళ్ళీ తెలియజేసింది ఈ సినిమా. ఫ్యామిలీ సినిమాల విషయంలో త్రివిక్రమ్ గారి స్పూర్తి ఎంతో ఉంటుంది. ఇలాంటి గొప్ప సినిమాను అందించిన వెంకీ అట్లూరికి కృతజ్ఞతలు. కొన్ని సినిమాలను వసూళ్లతో కొలవలేము. ప్రేక్షకులు పొందిన అనుభూతిలోనే ఈ సినిమా అసలు విజయం దాగుంది. వెంకీ రచనకు హ్యాట్సాఫ్. అలాగే తెలుగు ప్రేక్షకులకు నా ప్రత్యేక కృతఙ్ఞతలు.” అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us