Nikhil: ఆ జానర్ వదిలి పెట్టనంటున్న నిఖిల్‌.. అలా కలిసి వస్తుంది మరీ

యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న స్పై సినిమాలో సుభాష్‌ చంద్రబోస్ మిస్సింగ్‌కు సంబంధించిన సీక్రెట్‌ గురించి ఇన్వెస్టిగేట్ చేసే రా ఏజెంట్‌ పాత్రలో కనిపించబోతున్నారు నిఖిల్. మరిన్ని అప్ డేట్స్ తెలుసుకుందాం పదండి.

Nikhil: ఆ జానర్ వదిలి పెట్టనంటున్న నిఖిల్‌.. అలా కలిసి వస్తుంది మరీ
Actor Nikhil

Updated on: May 10, 2023 | 1:30 PM

కార్తికేయ సిరీస్‌తో సూపర్ హిట్ అందుకున్న నిఖిల్‌… ఇప్పుడు యాక్షన్ జానర్‌లోనూ అదే ఫార్ములాను రిపీట్ చేస్తున్నారు. కార్తికేయ సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాల్లోనూ ఓ మిస్టరీని అన్‌ఫోల్డ్ చేసే హీరోయిక్ రోల్‌లో కనిపించారు ఈ యంగ్ హీరో. నెక్ట్స్‌ స్పై సినిమాలో కూడా అలాంటి క్యారెక్టరే చేయబోతున్నారు. అనూహ్యంగా పాన్ ఇండియా మార్కెట్‌లో ఫ్లాష్‌ అయిన యంగ్ హీరో నిఖిల్‌. సౌత్‌లో ఇంట్రస్టింగ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో కార్తికేయ 2 పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఓ మిస్టరీని క్రాక్ చేసే పాత్రలో నటించారు.

కార్తికేయ తొలి భాగంలోనూ అలాంటి పాత్రలోనే కనిపించారు నిఖిల్‌. దేవుడి మీద నమ్మకం లేని ఓ వ్యక్తి ఓ ఊరిలో జరిగే వరుస హత్యలకు సంబంధించిన మిస్టరీని ఎలా బయట పెట్టారు అన్నదే కార్తికేయ కథ. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్స్ కావటంతో నెక్ట్స్ స్పై సినిమాలో కూడా ఇదే ఫార్ములా కంటిన్యూ చేస్తున్నారు.

యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న స్పై సినిమాలో సుభాష్‌ చంద్రబోస్ మిస్సింగ్‌కు సంబంధించిన సీక్రెట్‌ గురించి ఇన్వెస్టిగేట్ చేసే రా ఏజెంట్‌ పాత్రలో కనిపించబోతున్నారు. హాలీవుడ్ రేంజ్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో అల్ట్రా స్టైలిష్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా నిఖిల్‌ కెరీర్‌లో మరో మెమరబుల్ మూవీ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..