69 నేషనల్ అవార్డ్స్ జాబితా విడుదల చేశారు. తెలుగు సినిమాలకు ఈసారి జాతీయ అవార్డ్స్ జల్లు కురిసింది. 69 ఏళ్ల చరిత్రలో రికార్డ్ క్రియేట్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు అల్లు అర్జున్. ఉత్తమ నటుడిగా 69ఏళ్లుగా ఒక్క టాలీవుడ్ హీరో కూడా జాతీయ అవార్డు అందుకోలేకపోయారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఆ రికార్డ్ ను క్రియేట్ చేశారు. తెలుగు సినిమాల్లో పుష్ప, కొండపోలం, ఆర్ఆర్ఆర్, ఉప్పెన సినిమాలకు అవార్డుల పంట పండింది. ఉత్తమ తెలుగు సినిమాగా ఉప్పెన సినిమా అవార్డు అందుకుంది. ఉత్తమ నటుడిగా పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు. ఉత్తమ నటిగా గంగూబాయ్ కథియావాడి సినిమాకు అలియాభట్ అవార్డునను అందుకున్నారు. బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్: కింగ్ సోలోమన్ (ఆర్‌ఆర్‌ఆర్), బెస్ట్ కొరియోగ్రఫర్‌గా ప్రేమ్‌రక్షిత్ (ఆర్‌ఆర్‌ఆర్), బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ : ఎంఎం కీరవాణి, ప్లేబ్యాక్ సింగర్ : కాలభైరవ (ఆర్‌ఆర్‌ఆర్).
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ (ఆర్ఆర్‌ఆర్), బెస్ట్ పాపులర్ సినిమా (ఆర్‌ఆర్‌ఆర్), ఉత్తమ లిరిసిస్ట్ చంద్రబోస్(కొండపొలం), బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: దేవీ శ్రీ ప్రసాద్ (పుష్ప), బెస్ట్ తెలుగు ఫిల్మ్ క్రిటిక్: పురుషోత్తమ చార్యులు అవార్డులు అందుకున్నారు. ఇదిలా ఉంటే ఈ జాతీయ అవార్డ్స్ పై నేచురల్ స్టార్ నాని హర్ట్ అయ్యాడు.
సూర్య నటించిన జై భీమ్ సినిమాకు ఒక్క అవార్డు కూడా రాలేదు దాంతో నాని హర్ట్ అయ్యాడు. నాని మాత్రమే కాదు చాలా మంది జై భీమ్ సినిమాకు అవార్డు రాకపోవడంతో సోషల్ మీడియాలో చాలా మంది రకరకాల పోస్ట్ లు పెడుతున్నారు. యదార్ధ సంఘటన ఆధారంగా జై భీమ్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో కథ , సూర్య నటన సినిమాకే హైలైట్. నాని పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న జై భీమ్ యాష్ ట్యాగ్
Can’t Believe How #JaiBhim Got Ignored in #69thNationalFilmAwards? pic.twitter.com/QxZacIMEID
— Tribal Army (@TribalArmy) August 24, 2023
ఇప్పటికే చాలా మంది జై భీమ్ సినిమాలోని సీన్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Best Film of India in this Decade ❤️❗#Jaibhim pic.twitter.com/fGIwWdqnIt
— Mr.வாலிபன்™ (@Vaalibanoff_) August 24, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.