Mahesh Babu- Rajamouli : రాజమౌళి- మహేష్ కాంబో మూవీలో కీలక పాత్రలో ఆ స్టార్ హీరో..

|

Oct 14, 2022 | 7:07 PM

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయిన జక్కన్న. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి ఆర్ఆర్ఆర్ సినిమాను ఎంతో సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్నారు రాజమౌళి.

Mahesh Babu- Rajamouli : రాజమౌళి- మహేష్ కాంబో మూవీలో కీలక పాత్రలో ఆ స్టార్ హీరో..
Mahesh Babu, Rajamouli
Follow us on

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా మానియా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. నెలలు గడుతున్నా ఈ సినిమా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయిన జక్కన్న. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి ఆర్ఆర్ఆర్ సినిమాను ఎంతో సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్నారు రాజమౌళి. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. మహేష్ బాబు ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు. ఇక ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు చేస్తున్న సినిమా తర్వాత రాజమౌళితో సినిమా చేయనున్నాడు.

అయితే ఈసినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జక్కన్న తో సినిమా చేస్తున్నారని తెలిసిన దగ్గర నుంచి ఫ్యాన్స్ లో ఉత్సహం రెట్టింపు అయ్యింది. ఈ సినిమా ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఈమూవీ జేమ్స్ బాండ్ తరహాలో ఉంటుందని కొంతమంది అంటుంటే మరికొంత మంది మాత్రం ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో మరో హీరో కూడా ఉండనున్నారని తెలుస్తోంది. స్టార్ హీరో కార్తి కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడని తెలుస్తోంది. హీరో కార్తితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. స్టోరీ లైన్ విన్న కార్తి పాజిటివ్ గా స్పందించినట్లు వార్తలొస్తున్నాయి. రాజమౌళి సినిమాలో ఛాన్స్ కాబట్టి కార్తి వదులుకోవడానికి రెడీగా లేడని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..