Abbas: సినిమా ఆఫర్స్ లేనప్పుడు నాకు అన్నం పెట్టింది వాళ్లే.. హీరో అబ్బాస్ ఎమోషనల్

ఒకప్పటి హ్యాండ్సమ్ హీరో, లవర్ బాయ్ అబ్బాస్ మళ్లీ నటుడిగా బిజీ అవుతున్నాడు. సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లోనూ నటిస్తున్నాడు. అయితే ఒకప్పుడు దక్షిణాదిలో క్రేజీ హీరోగా ఓ వెలుగు వెలిగిన అబ్బాస్ ఉన్నట్లుండి డౌన్ అయిపోయాడు. అవకాశాల్లేక ఇబ్బంది పడ్డాడు.

Abbas: సినిమా ఆఫర్స్ లేనప్పుడు నాకు అన్నం పెట్టింది వాళ్లే.. హీరో అబ్బాస్ ఎమోషనల్
Hero Abbas

Updated on: Jun 08, 2026 | 11:29 AM

ప్రేమదేశం సినిమాతో యూత్ కు ఫేవరెట్ హీరోగా మారిపోయాడు అబ్బాస్. ఆ తర్వాత కూడా పలు ప్రేమకథా చిత్రాల్లో నటించి టాలీవుడ్ లవర్ బాయ్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఒకానొక సమయంలో ఈ హీరోకు కూడా గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. సినిమా అవకాశాలు కరువయ్యాయి. అయితే సినిమా అవకాశాలు తగ్గిపోయాక హార్పిక్ యాడ్ లో నటించాడు అబ్బాస్. దీంతో ఆయన ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. సిల్వర్ స్క్రీన్ పై హ్యాండ్సమ్ హీరోగా కనిపించిన అబ్బాస్ ను ఇలాంటి యాడ్ లో చూడలేకపోతున్నామని అభిమానులు వాపోయారు. ఇక ఈ యాడ్ తర్వాత అబ్బాస్ ఇండియాలోనే కనిపించలేదు. కుటుంబ పోషణ కోసం ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లిపోయాడు. అక్కడ మెకానిక్ వంటి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించాడు. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఇండియాకు వచ్చి సినిమాల్లో బిజీ అవుతున్నాడు. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన హ్యాపీ రాజ్ సినిమాతో అబ్బాస్ రీఎంట్రీ ఇచ్చాడు. కొన్ని రోజుల క్రితమే రిలీజైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అబ్బాస్ కు గ్రాండ్ రీఎంట్రీ లభించింది.

అలాగే ఎగ్జామ్ అనే ఓ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లోనూ విలన్ గా యాక్ట్ చేశాడు అబ్బాస్. ఇది కూడా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడీ హ్యాండ్సమ్ యాక్టర్. అయితే ఒక ఇంటర్వ్యూలో తన ఆర్థిక పరిస్థితుల గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు అబ్బాస్. సినిమా అవకాశాలు లేని సమయంలో హార్పిక్ యాడ్ ద్వారా వచ్చిన డబ్బుతోనే కడుపు నింపుకొన్నామని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

ఎగ్జామ్ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో అబ్బాస్..

‘ సినిమా అవకాశాలు లేక, చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేని కఠిన సమయంలో ఆ హార్పిక్ బ్రాండ్ నాకు ఎంతో అండగా నిలిచింది. దాదాపు 8 సంవత్సరాల పాటు ఆ యాడ్ కాంట్రాక్ట్ ద్వారా లభించిన డబ్బుతోనే మా ఫ్యామిలీని పోషించాను. అంతో ఇంతో ఆర్థికంగా స్థిరపడగలిగాను. ఆ బ్రాండ్ యాజమాన్యం నాకు ఆర్థికంగానూ ఎంతో సపోర్ట్ చేసింది. సమాజం ఏమనుకున్నా సరే, నిజాయితీగా చెప్పాలంటే హార్పిక్ యాడ్ వలనే నా ప్లేట్ లోకి అన్నం వచ్చింది. వారే నాకు అన్నం పెట్టారు. దీనిపై విమర్శలు వచ్చినా కూడా నేను పెద్దగా పట్టించుకోలేదు’ అని అబ్బాస్ ఎమోషనల్ అయ్యాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us