Samantha: రీసెంట్‌గా తన హెల్త్ గురించి షాకింగ్ న్యూస్ చెప్పిన సమంత అభిమానులను డైలమాలో పడేశారు. సమంత కండిషన్ గురించి విన్న తరువాత, అసలు సమంత సినిమాలు కంటిన్యూ చేస్తారా..? ప్రజెంట్ సెట్స్ మీదున్న సినిమాల పరిస్థితేంటి? అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఈ డౌట్స్‌కు త్వరలోనే ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు సామ్. లేటెస్ట్‌గా యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఘన విజయం సాధించారు. అయితే ఈ సినిమా హిట్ అయినా… అభిమానులు మాత్రం ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అందుకు కారణం సమంత హెల్త్ కండిషనే. మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టుగా ఎనౌన్స్ చేసిన సమంత… అభిమానులకే కాదు.. ఇండస్ట్రీ జనాలకు కూడా చాలా డౌట్స్ క్రియేట్ చేశారు.
యశోద డబ్బింగ్ సమయంలోనే సెలెన్ బాటిల్‌తో కనిపించటంతో అసలు ఫ్యూచర్‌లో సమంత సినిమాలు కంటిన్యూ చేస్తారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉందంటే… సెట్స్ మీద ఉన్న సినిమాలను కంప్లీట్ చేసేందుకైన సమంత డేట్స్ ఇస్తారా అన్న డౌట్స్ కూడా రెయిజ్ అయ్యాయి. కానీ ఆ డౌట్స్‌కు చెక్ పెడుతూ మరోసారి తాను ఫైటర్ అని ప్రూవ్ చేసుకున్నారు సామ్.
చాలా రోజులుగా ట్రీట్మెంట్‌లో ఉన్న సమంత అనారోగ్యాన్ని జయించారు. ఇప్పటికే కోలుకున్న ఈ బ్యూటీ… త్వరలోనే సెట్‌లో అడుగుపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే కొత్త షూటింగ్ పూర్తి చేసుకున్న ఖుషీ సినిమాను ముందుగా కంప్లీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
డిసెంబర్ 10 లేదా 15 నుంచి ఖుషీ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. సమంత హెల్త్ కండిషన్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోనే ప్లాన్ చేసింది యూనిట్. ఈ ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్ తరువాత సమంత అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీలవుతారు. ఇన్నాళ్లు సమంత అసలు సినిమాలు కంటిన్యూ చేస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తం చేసిన వారు కూడా సామ్ రీ ఎంట్రీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు.
మరిన్ని సినిమా వార్తలు చదవండి