Rambha: దేవుడా..! అందంలో తల్లిని మించిపోయిందిగా..!! రంభ కూతురిని చూశారా..?

ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆ ఒక్కటీ అడక్కు సినిమా ద్వార పరిచయం అయ్యింది రంభ. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడంతో పాటు అద్దంతోనూ కుర్రకారును తన వైపు తిప్పుకుంది. ఆతర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది అల్లుడా మజాకా, బొంబాయి ప్రియుడు, హిట్లర్ సినిమాలో రంభ క్రేజ్ ను మరింత పెంచేశాయి.

Rambha: దేవుడా..! అందంలో తల్లిని మించిపోయిందిగా..!! రంభ కూతురిని చూశారా..?
Rambha Photos

Updated on: Mar 16, 2024 | 8:14 PM

రంభ.. ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పిన తక్కువే అందంతో, అభినయంతో కట్టిపడేసిన ఈ వయ్యారి. ఒకానొక టైం లో ఇండస్ట్రీని ఊపేసింది రంభ. ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆ ఒక్కటీ అడక్కు సినిమా ద్వార పరిచయం అయ్యింది రంభ. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడంతో పాటు అద్దంతోనూ కుర్రకారును తన వైపు తిప్పుకుంది. ఆతర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది అల్లుడా మజాకా, బొంబాయి ప్రియుడు, హిట్లర్ సినిమాలో రంభ క్రేజ్ ను మరింత పెంచేశాయి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసింది ఈ బ్యూటీ. హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ అదరగొట్టింది. స్టార్ హీరోలు అల్లు అర్జున్, ఎన్టీఆర్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది.

ఇక పెళ్లి తర్వాత దాదాపు సినిమాలకు దూరం అయ్యింది ఈ చిన్నది. రంభ మలేషియాకు చెందిన వ్యాపారవేత్తను పెళ్ళి చేసుకునింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక్క కుమారుడు.ఆ మధ్య రంభ భర్తతో విడిపోనుందని వార్తలు వచ్చాయి కానీ వాటి పై క్లారిటీ ఇచ్చారు భార్య భర్తలు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రంభ సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె అభిమానులతో అడపాదడపా టచ్ లోనే ఉంటుంది.

తాజాగా రంభ తన కూతురు ఫోటోలను షేర్ చేసింది. రంభ పెద్ద కూతురు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తల్లిని మించిన అందంతో అదరగొట్టింది రంభ కూతురు. రంభ కూతురు ఫోటోలు చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆమెను చూస్తుంటే అచ్చం రంభ జిరాక్స్ కాపీ అనిపిస్తోందని కొందరు అంటుంటే మరికొందరు ఇండస్ట్రీకి మరో హీరోయిన్ దొరికేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఏమాటకామాట రంభ కూతురు నిజంగా తల్లిని మించిన అందంతో ఆకట్టుకుంటుంది. మరి ఈ చిన్నది హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది చుడాలి.

రంభ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.