మీతో కలిసి మరోసారి నటిస్తా : మహేష్

ప్రముఖ హీరోయిన్, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతిని ఉద్ధేశించి ట్వీట్ చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. సోమవారం విజయశాంతి 53వ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ వేదికగా.. ఆమెకు బర్త్‌ డే విషెస్ తెలిపాడు. ఈ సందర్భంగా పాత స్మృతులను మహేష్ గుర్తు చేసుకున్నాడు. ‘మీరు ఇలాంటి బర్త్‌డేలు ఎన్నో జరుపుకోవాలని, మీతో కలిసి మరోసారి నటించేందుకు ఆసక్తిగా ఉందని తెలిపాడు. మీ రీ ఎంట్రీ గొప్పగా ఉండాలని కోరుకుంటున్నానని’ ట్వీట్ చేశాడు మహేష్. చివరిసారి కృష్ణ, […]

మీతో కలిసి మరోసారి నటిస్తా : మహేష్

Edited By:

Updated on: Jun 25, 2019 | 11:31 AM

ప్రముఖ హీరోయిన్, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతిని ఉద్ధేశించి ట్వీట్ చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. సోమవారం విజయశాంతి 53వ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ వేదికగా.. ఆమెకు బర్త్‌ డే విషెస్ తెలిపాడు. ఈ సందర్భంగా పాత స్మృతులను మహేష్ గుర్తు చేసుకున్నాడు. ‘మీరు ఇలాంటి బర్త్‌డేలు ఎన్నో జరుపుకోవాలని, మీతో కలిసి మరోసారి నటించేందుకు ఆసక్తిగా ఉందని తెలిపాడు. మీ రీ ఎంట్రీ గొప్పగా ఉండాలని కోరుకుంటున్నానని’ ట్వీట్ చేశాడు మహేష్.

చివరిసారి కృష్ణ, విజయశాంతి, మహేష్ బాబు కలిసి నటించిన సినిమా ‘కొడుకు దిద్దిన కాపురం’. ఈ సినిమా అప్పట్లో మహేష్‌కి మంచి గుర్తింపు తెచ్చింది.