
ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో వసూళ్ల సునామి సృష్టిస్తోంది ‘హనుమాన్’. చిన్న సినిమాగా సంక్రాంతి పండక్కి విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. ఒకే సారి మూడు సినిమాలు పోటీకి వస్తున్నా.. తమ కంటెంట్ పై నమ్మకంతో బరిలోకి దిగి భారీ విజయాన్ని సాధించారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇతిహాసాల్లోని సూపర్ హీరో హనుమాన్ పాత్రను స్పూర్తిగా తీసుకుని రూపొందించిన ఈ మూవీలో యంగ్ హీరో తేజా సజ్జా హీరోగా నటించాడు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలకపాత్రలు పోషించారు. సినీ రాజకీయ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది ఈ మూవీ. హనుమాన్ చిత్రం అద్భుతంగా ఉందంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ. 265 కోట్లు వసూళ్లు రాబట్టింది. సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలకు టార్గెట్ సెట్ చేసింది.
ఇప్పుడు ఈ సినిమా రూ. 300 కోట్ల దిశగా పరుగులు పెడుతుంది. పాన్ ఇండియా స్థాయిలో హనుమాన్ మ్యానియా కొనసాగుతుంది. అటు అమెరికాలోనూ ఈ సినిమా సత్తా చాటుతుంది. ఇప్పటికే నాలుగు మిలియన్ డాలర్స్ వసూళ్లు రాబట్టింది. ఓవైపు థియేటర్లలో ఈ మూవీ క్రేజ్ తగ్గనేలేదు.. అప్పుడే సీక్వెల్ పార్ట్ స్టార్ట్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. త్వరలోనే సీక్వెల్ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో కనిపించనున్నారని అంటున్నారు. ప్రస్తుతం హనుమాన్ 2 ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే.. అటు హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ పై ఓ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని త్వరలోనే డిజిటల్ ప్లాట్ ఫాంపైకి తీసుకురావాలనుకుంటున్నారట. థియేటర్లలో హనుమాన్ ఫీవర్ తగ్గకముందే ఈచిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనుకుంటున్నారట. అయితే తాజా సమాచారాం ప్రకారం ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను జీ5 కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది ఫిబ్రవరి రెండో వారంలో స్ట్రీమింగ్ కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు.
The whole of the world is celebrating #HanuMan with all their heart ❤️
Humongous 1CRORE+ FOOTFALLS and continues to show its dominance all over 🔥
Nizam Release by @MythriOfficial ❤️🔥
A @PrasanthVarma film
🌟ing @tejasajja123#HanuManEverywhere… pic.twitter.com/n2wxO47epI— Mythri Movie Makers (@MythriOfficial) January 28, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.