Hansika Motwani: సెంచురీ కోడతానంటున్న దేశముదురు భామ.. ఆశల పల్లకిలో హన్సిక

|

Jul 20, 2022 | 9:43 PM

దేశముదురు సినిమాతో పరిచయం అయ్యింది అందాల భామ హన్సిక(Hansika). మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ చిన్నది. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది ఈ చిన్నది.

Hansika Motwani: సెంచురీ కోడతానంటున్న దేశముదురు భామ.. ఆశల పల్లకిలో హన్సిక
Hansika
Follow us on

దేశముదురు సినిమాతో పరిచయం అయ్యింది అందాల భామ హన్సిక(Hansika). మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ చిన్నది. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది ఈ చిన్నది. హన్సిక తక్కువ సమాయంలోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. కుర్ర హీరోలందరి సరసన ఆడిపాడింది ఈ బ్యూటీ. తెలుగుతోపాటు తమిళ్ లోను ఈ అమ్మడు సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ఇటీవల కాలంలో తెలుగులో హన్సిక సినిమాలు తగ్గించింది. మరో వైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ వస్తుంది హన్సిక. ఇప్పటికే మై నేమ్‌ఈజ్ శృతి ఆమె సినిమా లో నటించింది ఈ చిన్నది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో ఇంట్రస్టింగ్ కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది హన్సిక.

హన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా మహా. ఈ సినిమాలో హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా హన్సిక కేరీర్ లో 50వ మూవీ. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ నెల 22న విడుదల అవుతున్న ‘మహా’ సినిమా
శింబు కీలక పాత్రలో నటించిన ‘మహా’ ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. యు.ఆర్‌‌.జమీల్‌‌ దర్శకత్వంలో మదియళగన్‌‌ దీనిని నిర్మించారు. శ్రీరామ్, కరుణాకరన్ ఇతర కీలక పాత్రలు పోషించిన చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందించాడు. అయితే ఈ సినిమా మ్యాజిక్ నెంబర్ అయినప్పటికీ ఈ సినిమా ను హన్సిక అంతగా పట్టిన్చుకోవడంలేదు.. అయితే 50 అనేది చిన్న నెంబర్ సెంచరీ కొట్టాలన్నది తన ఆశ అని చెప్పుకొచ్చింది హన్సిక.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి