Guppedantha Manasu: సీరియల్లో స్వీటూ.. నెట్టింట యమహాటు.. వసూ ఫోటోలు చూస్తే దిమ్మతిరగాల్సిందే..

|

Sep 04, 2024 | 7:49 PM

ఇదిలా ఉంటే.. వసుధార పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రక్షా గౌడ.. ఆ సీరియల్లో పంజాబీ డ్రెస్సులు, చీరకట్టులో ఎంతో పద్దతిగా కనిపించింది. కానీ సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా డిఫరెంట్. మోడ్రన్ డ్రెస్సులలో గ్లామర్ షో నెట్టింట ఫాలోవర్లను కట్టిపడేస్తుంది. తాజాగా వసుధార క్రేజీ ఫోటోస్ ఇన్ స్టాలో వైరలవుతున్నాయి.

Guppedantha Manasu: సీరియల్లో స్వీటూ.. నెట్టింట యమహాటు.. వసూ ఫోటోలు చూస్తే దిమ్మతిరగాల్సిందే..
Vasudhara
Follow us on

బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆక్టటుకున్న సీరియల్ గుప్పెడంత మనసు. కార్తీక దీపం తర్వాత ఆ స్థాయిలో టీఆర్పీ సొంతం చేసుకున్న ధారవాహిక ఇదే. ఇందులో రిషి, వసుధార పాత్రలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. 2020లో ప్రారంభమైన ఈ సీరియల్ అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించి టాప్ స్థానంలో దూసుకుపోయింది. మహేంద్ర, జగతి మేడమ్, దేవయాని పాత్రలకు కూడా అభిమానులు ఉన్నారంటే ఈ సీరియల్ కు వచ్చిన రెస్పాన్స్ ఏ స్థాయిలో ఉందో చెప్పక్కర్లేదు. ఇక ఈ సీరియల్లో రిషి పాత్రలో కన్నడ నటుడు ముఖేష్ గౌడ నటించగా.. వసుధార పాత్రలో రక్షా గౌడ నటించింది. వీరిద్దరి జోడికి యూత్ ఫాలోయింగ్ ఎక్కువే. అయితే ఇందులో అందం, అమాయకత్వం, తెలివైన అమ్మాయిగా ఇలా అన్ని రకాలుగా తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది వసూధార. ఇటీవలే ఈ సీరియల్ కు శుభం కార్డ్ పడిన సంగతి తెలిసిందే.

అయితే అనుహ్యంగా సీరియల్ ముగించడానికి కారణం బిగ్ బాస్ షో అనుకున్నారంతా. రిషి, వసుధార ఇద్దరూ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇస్తున్నారని.. అందుకే అర్ధాంతరంగా ఈ సీరియల్ ముగించారని టాక్ నడిచింది. కానీ ఇప్పటివరకు వీరిద్దరు ఆ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఇకపై వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఛాన్స్ కూడా ఉందండోయ్. ఇదిలా ఉంటే.. వసుధార పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రక్షా గౌడ.. ఆ సీరియల్లో పంజాబీ డ్రెస్సులు, చీరకట్టులో ఎంతో పద్దతిగా కనిపించింది. కానీ సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా డిఫరెంట్. మోడ్రన్ డ్రెస్సులలో గ్లామర్ షో నెట్టింట ఫాలోవర్లను కట్టిపడేస్తుంది. తాజాగా వసుధార క్రేజీ ఫోటోస్ ఇన్ స్టాలో వైరలవుతున్నాయి.

రక్షా గౌడ కర్ణాటకలోని మైసూర్ అమ్మాయి. కానీ విధ్యాభ్యాసం మాత్రం బెంగుళూరులో పూర్తి చేసింది. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. తండ్రి బయో మెడికల్, తల్లి నర్సు. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనుకున్న రక్షా గౌడ.. ఆ తర్వాత ఐఎఎస్ కావాలనుకుంది. బీబీఎం పూర్తి చేసిన రక్షా గౌడ నటనపై ఆసక్తితో కన్నడ సీరియల్స్ చేసింది. రాధా రమణ సీరియల్ ద్వారా సినీ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత గరుడ దక్ష చిత్రంలో మెరిసింది. ఇక తర్వాత కృష్ణవేణి సీరియల్ ద్వారా తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఈ సీరియల్ అంతగా క్లిక్ కాలేదు. కానీ గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇందులో వసుధార పాత్రలో క్యూట్ నటనతో కట్టిపడేసింది.\

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.