మహేశ్వరి.. తెలుగు అభిమానులకు ఈ పేరు సుపరిచితమే. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కలిపి సుమారు 35 చిత్రాల్లో నటించిన ఈ అందాల భామ.. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. 1995లో ‘అమ్మాయి కాపురం’ చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టిన మహేశ్వరి ఆ తర్వాత ‘గులాబీ’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర హిట్ దక్కించుకుంది. అలాగే ‘పెళ్లి’ సినిమాతో ఫ్యాన్స్‌లో మంచి గుర్తింపు సంపాదించింది. ‘నీకోసం’, ‘ప్రియరాగాలు’, ‘మా బాలాజీ’ లాంటి చిత్రాలతో ఒక్కసారిగా అభిమానులను తన వైపుకు తిప్పుకుంది. 90’sలో తెలుగులో స్టార్ హీరోయిన్‌గా విపరీతమైన పాపులారిటీని తెచ్చుకుంది. ఇలా టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలో మహేశ్వరి ఒక్కసారిగా సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే.
తమిళంలో అజిత్, విక్రమ్ లాంటి అగ్ర నటుల సరసన నటించింది మహేశ్వరి. అలాగే పెళ్లి తర్వాత 2012లో జీ తెలుగులో ‘మై నేమ్ ఈజ్ మంగతాయారు’ అనే సీరియల్‌లో నటించింది. ఇది అప్పట్లో బుల్లితెరపై పెద్ద హిట్ అని చెప్పొచ్చు. ఇక తెలుగులో మహేశ్వరి చివరిగా ‘తిరుమల తిరుపతి వెంకటేశ’ చిత్రంలో కనిపించింది. 2008లో జయకృష్ణ అనే బిజినెస్‌మాన్‌ను పెళ్లి చేసుకున్న మహేశ్వరి.. అతిలోక సుందరి శ్రీదేవికి కజిన్ సిస్టర్. ఇప్పటిదాకా ఫ్యాన్స్‌కు, సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఆమె.. తాజాగా తన ఫ్యామిలీ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. కాగా, మహేశ్వరి ప్రస్తుతం జాన్వి కపూర్‌కు తోడుగా ఉంటున్నారని తెలుస్తోంది. అలాగే ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నారని సమాచారం.