పై ఫొటోలో చిన్నారి గోపికను గుర్తు పట్టారా? చారడేసి కళ్లు, చేతిలో కుండ పెట్టుకుని ఎంతో క్యూట్ గా కనిపిస్తోన్న ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ ఫేమస్ సెలబ్రిటీ. తన అందం, అభినయంతో పాటు తన మాటల గారడితో కొన్నేళ్ల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించించింది. స్టార్ యాంకర్ గా తిరుగులేని క్రేజ్ ను సొంతం చేసుకుంది. అప్పుడప్పుడూ సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిసి సినీ ప్రేక్షకులను అలరించింది. తన మాటల గారడీతో ఒకానొక సమయంలో స్టార్ యాంకర్ సుమ కనకాలకు పోటీగా భావించిన ఈ అందాల యాంకరమ్మ ఉన్నట్లుండి సైలెంట్ అయిపోయింది. కొన్నేళ్ల పాటు అటు బుల్లితెరపై కానీ, ఇటు వెండితెరపై కానీ కనిపించలేదు. పెళ్లై, పిల్లలున్న ఈ బ్యూటీ క్వీన్ ఈ సీనియర్ యాంకరమ్మ మళ్లీ బిజీ అవుతోంది. కొన్ని టీవీ షోల్లో సందడి చేస్తోంది. మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు ఒకప్పుడు స్టార్ యాంకర్ గా బుల్లితెరను ఏలిన ఉదయ భాను. ఇది ఆమె చిన్ననాటి ఫొటో.
కొన్నేళ్ల క్రితం ఏ టీవీ ఛానెల్ పెట్టినా ఉదయభానే కనిపించేది. ‘వన్స్ మోర్ ప్లీజ్’, ‘సాహసం చేయరా డింభకా’, ‘జానవులే నెర జానవులే’, ‘హృదయాంజలి’, ‘లక్స్ డ్రీమ్ గర్ల్, ‘ఛాంగురే బంగారు లేడి’, ‘డ్యాన్సింగ్ స్టార్’, ‘తీన్ మార్’ , ‘రేలా రే రేలా’, ‘రంగం’, ఢీ.. ఇలా ఏ ప్రోగ్రామైనా ఉదయ భాను మాటలే వినిపించేవి. అయితే పెళ్లి, పిల్లల కారణంగా సడెన్ గా ప్రొఫెషనల్ కెరీర్ కు దూరమైందీ అందాల యాంకరమ్మ. కొన్ని నెలల క్రితం ఓ టీవీ షోకు వచ్చిన ఉదయభాను బుల్లితెరకు తాను ఎందుకు దూరం కావల్సిందో చెబుతూ భావోద్వేగానికి లోనయ్యింది. తన జీవితంలో అనూహ్యంగా చోటు చేసుకున్న కొన్ని చేదు అనుభవాలను పంచుకుంది. ప్రెగ్నెన్సీ కారణంగానే యాంకరింగ్ కు కామా పెట్టేశానంది. టీవీ షోల సంగతి పక్కన పెడితే.. కొన్ని తెలుగు సినిమాల్లోనూ ఉదయభాను నటించింది. ఎర్ర సైన్యం, కొండవీటి సింహాసనం, పోలీస్ నంబర్ వన్, శ్రావణమాసం, ఆపద మొక్కుల వాడు, లీడర్, జులాయి, మధుమతి తదితర సినిమాల్లో స్పెషల్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ తో సందడి చేసింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది ఉదయ భాను. తన పిల్లల ఫొటోలు, వీడియోలను తరచూ అందులో షేర్ చేస్తుంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.