Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..

సినీరంగంలో నటీనటులుగా గుర్తింపు తెచ్చుకున్నవారు చాలా మంది ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో తోబుట్టువులు సైతం స్టార్ డమ్ సంపాదించుకున్నారు. ఆ జాబితాలో కొందరు సక్సెస్ కాగా.. మరికొందరు మాత్రం పాతాళానికి పడిపోయారు. అయితే ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఇద్దరు హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ వైరల్ గా మారాయి.

Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..
Simran

Updated on: Jan 30, 2026 | 11:37 PM

సాధారణంగా సినీరంగంలో అన్నతమ్ముల్లు, అక్కాచెల్లెల్లు తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో కొందరు సక్సెస్ కాగా.. మరికొంతమంది తోబుట్టువులు మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. పైన ఫోటోను చూస్తున్నారు కదా.. అందులో కనిపిస్తున్నవారు ఇద్దరూ సొంత అక్కా చెల్లెల్లు. నటనపై ఆసక్తితో అక్క ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగా.. సోదరి బాటలోనే చెల్లెలు సైతం సినీరంగంలోకి తెరంగేట్రం చేసింది. కానీ అక్క స్థాయిలో చెల్లెలు మాత్రం రాణించలేకపోయింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే ప్రేమ పేరుతో మోసపోయి సూసైడ్ చేసుకుని ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయింది. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరో గుర్తుపట్టారా.? ఆ ఫోటోలో అక్క మరెవరో కాదండి.. హీరోయిన్ సిమ్రాన్.

ఎక్కువమంది చదివినవి : Ramya Krishna : నా భర్తకు దూరంగా ఉండటానికి కారణం అదే.. హీరోయిన్ రమ్యకృష్ణ..

సిమ్రాన్ 90లలో తమిళ సినిమాల్లో టాప్ హీరోయిన్. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. అప్పట్లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దక్షిణాదిలో చక్రం తిప్పిన హీరోయిన్లలో ఆమె ఒకరు. అందం, అభినయంతో మెప్పించిన సిమ్రాన్ సోదరి సైతం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

ఎక్కువమంది చదివినవి : Actress Rohini: రఘువరన్‏తో విడిపోవడానికి కారణం అదే.. ఆయన ఎలా చనిపోయాడంటే.. నటి రోహిణి..

సిమ్రాన్ సోదరి మోనల్ నావల్ సైతం అక్క అడుగుజాడల్లోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదటి చిత్రంతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ఓ కొరియోగ్రాఫర్ తో ప్రేమలో పడి మోసపోయింది. చివరకు మానసిక ఒత్తిడితో సూసైడ్ చేసుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.

ఎక్కువమంది చదివినవి : Tollywood: ఏంటండీ మేడమ్.. అందంతో చంపేస్తున్నారు.. నెట్టింట సీరియల్ బ్యూటీ అరాచకం.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..

Simran 

ఎక్కువమంది చదివినవి : Tollywood : అప్పుడు రామ్ చరణ్ క్లాస్‏మెట్.. ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్.. ఏకంగా చిరుతో భారీ బడ్జెట్ మూవీ..