సుందర భవనంలో సుందరాంగి ఫోజు అదిరిపోయిందిగా.. ఎవరో కనిపెట్టారా.?

|

Jul 23, 2022 | 6:27 PM

అందాల భామలు సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తున్నారు. నిత్యం హాట్ ఫోటోలు, రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు.

సుందర భవనంలో సుందరాంగి ఫోజు అదిరిపోయిందిగా.. ఎవరో కనిపెట్టారా.?
Pooja Hegde
Follow us on

అందాల భామలు సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తున్నారు. నిత్యం హాట్ ఫోటోలు, రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. ఇక వెకేషన్స్ అని విదేశాలకు ఎగిరిపోయి అక్కడి అందమైన లొకేషన్స్‌లో వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఇప్పుడు ఓ అమ్మడు కూడా అదే పని చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడిపిన ఈ సుందరి.. ఇప్పుడు చిన్న గ్యాప్ తీసుకొని విహారయాత్రకు వెళ్ళింది. ఇంతకు పై ఫొటోలో ఉన్న బ్యూటీని గుర్తుపట్టారా..? గుర్తుపట్టడం అంత కష్టమేమీ కాకపోవచ్చు.. ఈ చిన్నది ఎవరో కాదు..

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతోంది పూజాహెగ్డే. తెలుగు ఈ అమ్మడిని బుట్టబొమ్మ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు ఫ్యాన్స్. ఒక లైలా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూజ ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇటీవల బీస్ట్ , రాధేశ్యామ్, ఆచార్య సినిమాలతో సందడి చేసింది పూజ హెగ్డే. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. అలాగే తెలుగులో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా విహారయాత్రలో ఎంజాయ్ చేస్తూ.. అందంగా ఫొటోకు ఫోజ్ ఇచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి