Tollywood: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా ?.. ఒక్క సినిమాతోనే ఓవర్నైట్ పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది..
ఆమె కథానాయికగా నటించిన సినిమా పాన్ ఇండియా లెవల్లో సూపర్ హిట్ కావడమే కాదు.. భారీగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ వచ్చేసింది. అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది..
పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా ?.. ఒక్క సినిమాతోనే ఓవర్నైట్ పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది.. ఆమె కథానాయికగా నటించిన సినిమా పాన్ ఇండియా లెవల్లో సూపర్ హిట్ కావడమే కాదు.. భారీగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ వచ్చేసింది. అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది.. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తెరకెక్కిస్తోన్న సినిమాలో నటిస్తోంది. ఎవరో గుర్తుపట్టండి. ఆ ముద్దుగుమ్మ ఎవరంటే.. కాంతార ఫేమ్ సప్తమి గౌడ. కన్నడ నటుడు.. కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చిత్రంలో హీరోయిన్గా కనిపించింది సప్తమి. ఈ మూవీలో ఫారెస్ట్ ఆఫీస్ పాత్రలో నటించింది. తాజాగా ఈ అమ్మడకు చెందిన కాలేజ్ డేస్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.
ప్రముఖ నిర్మాత సంస్థ హోంబలే ఫిల్మ్ బ్యానర్ పై రూ. 16 కోట్ల బడ్జె్ట్ తో నిర్మించిన కాంతార చిత్రం దేశవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా రాబట్టింది. ముందుగా కన్నడలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో డబ్ చేసి విడుదల చేయగా.. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఆదివాసీల సాంప్రదాయ నృత్యమైన భూత కోలా చుట్టూ తిరుగుతుంది.
ఇదిలా ఉంటే.. కాంతార చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. జెనీవా (స్విట్జర్లాండ్ )లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో మార్చి 17న ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ మేరకు హీరో రిషబ్ శెట్టి ఇప్పటికే స్విట్జర్లాండ్ చేరుకున్నారు. అక్కడ సినిమా స్క్రీనింగ్ పూర్తైన అనంతరం ఆయన ప్రసంగించనున్నారు. పర్యావరణ పరిరక్షణలో భారతీయ సినిమా పాత్ర గురించి ఆయన మాట్లాడనున్నారు. ఇక ఐరాసలో ప్రదర్శితమయ్యే తొలి కన్నడ సినిమాగా కాంతార చిత్రం ఇప్పుడు రికార్డ్ క్రియేట్ చేసింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.