
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. స్టార్స్ చిన్ననాటి పిక్స్ నెట్టింట వైరలవుతుండగా.. తాజాగా ఓ అందాల తార క్రేజీ పిక్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. గాలితో పోటిపడుతున్నాయి ఆ ముద్దుగుమ్మ ఉంగరాల ముంగురులు. మత్తెక్కించే చూపులతో కవ్విస్తోంది వెండితెర జాబిలమ్మ. ఎవరో గుర్తుపట్టగలరా ?.. ఇప్పుడిప్పుడే స్టా్ర్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోవడానికి ఆరాటపడుతుంది. మరాఠి ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించిన ఈబ్యూటీ.. ఇటీవలే ఓ తెలుగు సినిమా చేసింది. తొలి సినిమాకే పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ చిన్నది.. ఇప్పటివరకు మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. గుర్తుకు వచ్చిందా ?.. తనే పొట్టి నూడుల్స్.. అలియాస్… మిథిలా పాల్కర్.
1993లో ముంబైలో జన్మించిన మిథిలా.. హనీమూన్ అనే షార్ట్ ఫిల్మ్ లో తొలిసారిగా నటించింది. ఆ తర్వాత కత్తిబట్టి సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మురాంబ, కార్వాన్, చాప్ స్టిక్లు వంటి సినిమాల్లో నటించిన మిథిలా.. బాలీవుడ్ లో కథానాయికగా పాపులారిటిని సంపాదించుకుంది. ఇక ఇటీవల మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమాలో మిథిలా పాల్కర్ కథానాయికగా నటించింది. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ. ఈ సినిమాతో నటిగా ప్రశంసలు అందుకుంది.
ఈ సినిమాలో ఆమెను పొట్టి నూడుల్స్ అంటూ విశ్వక్ సేన్ పిలవడంతో తెగ పాపులర్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఓరి దేవుడా సినిమా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పటివరకు మరో సినిమా అనౌన్స్ చేయలేదు మిథిలా . అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.