Tollywood: నాలుగేళ్లకే సినీరంగ ప్రవేశం చేసిన చిన్నారి.. మొదటి మహిళా సూపర్ స్టార్.. ఎవరో గుర్తుపట్టండి..

బాలనటిగా సినీ ప్రయాణం ప్రారంభించిన ఈ చిన్నారి తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది. సీనియర్ ఎన్టీఆర్, శోభన్ బాబు, వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి, కృష్ణ, అక్కినేని నాగార్జున వంటి స్టార్ హీరోస్ సరసన నటించి అలరించింది. బాలీవుడ్ లోనూ పలు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఎవరో గుర్తుపట్టారా ?.. అగ్ర కథానాయికగా అలరించిన ఆ తార.. ఆకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.

Tollywood: నాలుగేళ్లకే సినీరంగ ప్రవేశం చేసిన చిన్నారి.. మొదటి మహిళా సూపర్ స్టార్.. ఎవరో గుర్తుపట్టండి..
Actress

Updated on: Aug 04, 2023 | 10:14 PM

పైన ఫోటోలో కనిపిస్తోన్న ఈ చిన్నారి చిత్ర పరిశ్రమలో మొదటి మహిళా సూపర్ స్టార్. సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. బాలనటిగా సినీ ప్రయాణం ప్రారంభించిన ఈ చిన్నారి తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది. సీనియర్ ఎన్టీఆర్, శోభన్ బాబు, వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి, కృష్ణ, అక్కినేని నాగార్జున వంటి స్టార్ హీరోస్ సరసన నటించి అలరించింది. బాలీవుడ్ లోనూ పలు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఎవరో గుర్తుపట్టారా ?.. అగ్ర కథానాయికగా అలరించిన ఆ తార.. ఆకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. అప్పట్లో ఒక సినిమాకు రూ.కోటి రెమ్యూనరేషన్ తీసుకున్న నటి ఆమె. తనే శ్రీ అమ్మ యంగర్ అయ్యప్ప్.. అలియాస్ అతిలోక సుందరి శ్రీదేవి. 4 సంవత్సరాల వయసులోనే తన నటన జీవితాన్ని ప్రారంభించింది.

తునైవన్ అనే పౌరాణిక సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. దాదాపు 300 చిత్రాల్లో నటించింది మెప్పించింది. రజినీకాంత్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, షారుఖ్, సల్మాన్, అనిల్ కపూర్ సినిమాల్లో నటించారు. అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. పదమూడేళ్ళ వయసులో ముడిచు సినిమాలో రజినీకాంత్ కు సవతి తల్లిగా నటించింది. దశాబ్ద కాలంపాటు సినిమాలకు బ్రేక్ తీసుకున్న ఆమె.. 2012లో ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.

టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు శ్రీదేవి. వీరికి ఇద్దరు అమ్మాయిలు. జాన్వీ కపూర్, ఖుషి కపూర్. 2018లో శ్రీదేవి దుబాయిలో తన బంధువుల ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తన మేనల్లుడు మోహిత్ మార్వా వివాహానికి హాజరయిన ఆమె.. అక్కడి హోటల్ గదిలో బాత్ రూమ్ లో మరణించారు. శ్రీదేవికి జాతీయ చలనచిత్ర అవార్డ్, కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డ్, నంది అవార్డ్, నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.